Today Horoscope January 18 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం. 2026 జనవరి 18 ఆదివారం. పుష్య మాసం, హేమంత రుతువు ఉత్తరాయణం. అమావాస్య ప్రత్యేకం. ఈరోజు అదృష్టం కలిసే వచ్చే రాశులు ఏవి? ఏ రాశులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగానే ఉంటుంది. కాస్త ఇబ్బందులు లేకుండా పని కొన సాగిపోతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటే అవి కలిసి వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. తద్వారా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు.
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచూతూచి జాగ్రత్తలు తీసుకోండి. కీలక నిర్ణయాల్లో పెద్దల సూచన తప్పనిసరి. ఆకస్మిక ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య కాస్త క్షీణిస్తుంది. పని ప్రదేశంలో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి వారికి ఈరోజు పాజిటివ్గా సాగిపోతుంది. పెండింగ్లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. శత్రువుల పై పైచేయి మీదే. అన్ని పనులు కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈరోజు శుభప్రదం.
సింహరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తపడాలి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు కాస్త ఇబ్బందికరమని చెప్పాలి. అయితే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సూచన తప్పనిసరి. బద్దకం వీడితే కలిసి వస్తుంది. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి.
కుంభరాశి వారికి ఈరోజు పాజిటివ్గా సాగిపోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. అనుకున్న పని సాధిస్తారు. అయితే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ధన నష్టం వాటిల్లుతుంది, జాగ్రత్తలు తప్పనిసరి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సా ధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)