Horoscope: నేటి రాశిఫలాలు.. శ్రీ పంచమి ప్రత్యేకం, ఈ 3 రాశులకు గుడ్ న్యూస్! మీరు ఆ లిస్టులో ఉన్నారా?

Today Horoscope January 23 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, మాఘమాసం, శిశిర రుతువు, ఉత్తరాయణం, 2026 జనవరి 23 శుక్రవారం శ్రీ పంచమి ప్రత్యేకం. పండితుల ప్రకారం జాగ్రత్త వహించాల్సిన రాశులు ఏవి? ఏ రాశులకు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. 
 

1 /5

 మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా కలిసి వచ్చే రోజు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు కూడా పొందుతారు. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే రోజు. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.   

2 /5

 వృషభ రాశి వారు కూడా ఈరోజు హాయిగా సాగిపోయే రోజు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందే రోజు. ఉద్యోగం మారేవారికి ఇది శుభకరమైన రోజు అని చెప్పొచ్చు. వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది.   

3 /5

 కర్కాటక రాశి వారికి రోజు మిశ్రమంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఇతరుల విషయంలో తలదూర్చకండి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అయితే ఒక శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త అవకాశాలు తెస్తుంది.  

4 /5

 సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదమే. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే రోజు. ఆకస్మిక ధన లాభ సూచన. సింహ రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఈరోజు వారికి ఒక వినోదాత్మకమైన రోజు అని చెప్పొచ్చు. మొత్తానికి ఈరోజు సింహ రాశివారికి అన్ని పాజిటివ్ వైబ్స్‌.  

5 /5

 కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. పని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. బద్దకం పెడితేనే సక్సెస్ వరిస్తుంది. ఆకస్మిక ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇతరులను అంత ఈజీగా నమ్మకండి, ఖర్చులు తగ్గించుకోండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సా ధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)