Horoscope March 9 Telugu: నేటి రాశి ఫలాలు శ్రీ క్రోధీ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర రుతువు పాల్గున మాసం. శుక్ల పక్షం 2025 మార్చి 9 ఆదివారం రోజున ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం.
మార్చి 9వ తేదీ ఆదివారం మేష రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. గృహ యోగం లేదా వాహన యోగం కలిగే అవకాశం ఉంటుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. ఈరోజు వర్క్ లైఫ్ కూడా హాయిగా సాగిపోతుంది.
మిథున రాశి వారికి ఈ రోజు కాస్త ఉపశమనం కలిగించే దినం. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారికి కూడా ఆదివారం శుభా కాలం. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఇక ఆఫీసు పని కూడా హాయిగా సాగుతుంది.
ధనస్సు రాశి వారికి ఈరోజు అందర్నీ ఆకట్టుకునే ఒక సామర్థ్యం పెరుగుతుంది. తన మాటల చాతుర్యతతో సులభంగా ఇతరులను ఆకట్టుకుంటారు. ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి.
మీన రాశి వారికి ఈ రోజు బాగా లక్కీ సమయం అని చెప్పాలి. ముఖ్యంగా వీరి వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు బాగా వస్తాయి. పనిప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు, ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి.