Today March 21 Horoscope Telugu: ఈరోజు మార్చి 21 శుక్రవారం. శ్రీక్రోధి నామ సంవత్సరం ఉత్తరాయనం, బహుళపక్షం ఫాల్గుణ మాసం. సూర్యోదయం ఉదయం 6:11, సూర్యాస్తమయం 6:18 గంటల వరకు ఉంటుంది.
1/6మేషరాశి.. ఈరోజు మేషరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ప్రధానంగా ఈ రాశివారు కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. పని ప్రదేశంలో జాగ్రత్తగా మెలగాలి. అనవసరంగా నోరు పారేసుకోకూడదు.
2/6మిథున రాశి.. మిథున రాశివారు ఈరోజు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎవరికైనా అవసరాలు ఉంటే వాటిని తీరుస్తారు. కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది.
3/6కర్కాటక రాశి.. కర్కాటక రాశివారికి కష్టే ఫలం. విజయం సాధించాలంటే అధికంగా శ్రమించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ రాశివారు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి మీపై ప్రేమ చూపిస్తాడు.
4/6కన్యారాశి.. ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెద్దల సలహా తీసుకోవడం మేలు. కన్యా రాశివారు అవసరానికి మించి ఖర్చులు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
5/6తులరాశి.. తులరాశి వారికి ఈరోజు హాయిగా గడిచిపోతుంది. పని ప్రదేశంలో కూడా ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారికి మొత్తానికి ఈరోజు సుఖమైన జీవనం ఉంటుంది.
6/6కుంభ రాశి.. ఈ రాశివారికి ఈరోజు బాగానే ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పెద్దగా కష్టం లేకున్నా కలిసి వస్తుంది. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)