Petrol Diesel Price Low Price: మన దేశంలో పెట్రోల్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సెంట్రల్, స్టేట్ ట్యాక్స్‌లు, ఇతర ట్యాక్స్‌లు ఉండడంతో చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు పైనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో లీటర్ వాటర్ బాటిల్ కంటే.. పెట్రోల్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఆ దేశాలలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
1/6లిబియా దేశంలో లీటరు పెట్రోల్ కేవలం 0.03 డాలర్లు మాత్రమే. ఇక్కడ లీటర్ వాటర్ బాటిల్ ధర దాదాపు 0.45 డాలర్లుగా ఉంది. దేశంలో చమురు సంపదకు తోడు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పెట్రోల్ తక్కువ ధరకు లభిస్తోంది.
2/6వెనిజులా దేశంలో ఇంధనం లీటరుకు కేవలం 0.02 డాలర్లకు లభిస్తోంది. అయితే ఇక్కడ వాటర్ ధర లీటరుకు 0.60 డాలర్లుగా ఉంది. ఈ దేశంలో పెట్రోల్‌పై ఎక్కువ సబ్సిడీ ఉండడంతో ధరలు తక్కువగా ఉన్నాయి.
3/6సౌదీ అరేబియాలో లీటర్ వాటర్ కంటే పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. లీటర్ పెట్రోల్ 0.58 డాలర్లు ఉంటే.. బాటిల్ వాటర్ ధర లీటరుకు 1.20 డాలర్లుగా ఉంది. ఇక్కడ భారీగా చమురు నిల్వలు ఉండడంతో పెట్రోల్ ధర తక్కువగానూ.. ఎడారి ప్రాంతం కావడంతో వాటర్ ధర ఎక్కువగానూ ఉంది.
4/6కువైట్‌లో కూడా పెట్రోల్ ధర తక్కువగానే ఉంది. ఈ దేశంలో పెట్రోల్ ధర 0.34 డాలర్లు ఉండగా.. బాటిల్ వాటర్ లీటరుకు 1.50 వరకు ఉంటుంది. ఇక్కడ ఇంధనంపై ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. అయితే డీశాలినేషన్ ఖర్చుల కారణంగా నీటి ధర ఖరీదుగా ఉంది.
5/6అంగోలా దేశంలో పెట్రోల్ కోసం లీటరుకు దాదాపు 0.33 డాలర్లు ఖర్చవుతుంది. అయితే ట్రాన్స్‌పోర్ట్ సమస్యల కారణంగా లీటర్ వాటర్ 0.80 డాలర్లకు లభిస్తోంది. ఆర్థిక సవాళ్లు ఉన్నా.. ఇంధనం సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయి.
6/6అల్జీరియాలో పెట్రోల్ ధర దాదాపు 0.34 డాలర్లుగా ఉంది. లీటర్ వాటర్ ధర 0.50 డాలర్లకు లభిస్తోంది. చమురుపై ఆదాయం ఎక్కువ ఉండడంతో ఇంధనంపై సబ్సిడీలు ఉన్నాయి. అయితే వాటర్‌ను పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చులు ఎక్కువ ఉండడంతో ధర ఎక్కువగా ఉంది.