School Holiday Today
దీపావళి పండుగలు ముగిసిన తర్వాత.. వర్షాల కారణంగా మరో రెండు, మూడు రోజులు కొన్ని ప్రదేశాల్లో సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో..ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్కింగ్ డేగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో చఠ్ పూజా కారణంగా.. అలానే వర్షాల కారణంగా.. సెలవు ప్రకటించారు.
1/5నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో విపరీతమైన వర్షాలు చోటు చేసుకున్నాయి. అయితే అవి ఈరోజు తగ్గు ముఖం పట్టదంతో.. తిరుపతి, నెల్లూరు లాంటి ప్రదేశాలలో ఈరోజు యధావిధిగా స్కూల్స్ జరగనున్నాయి. కానీ తమిళనాడులో ఇంకా వర్షాలు కొనసాగుతూ ఉండడంతో.. అక్కడ సెలవు ప్రకటించారు ప్రభుత్వం.
2/5ఇక కర్ణాటక..కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే ఆరెంజ్.. యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్ణాటకలో ఉడుಪಿ, దక్షిణ కన్నడ, శివమొగ్గ, చిక్‌మగళూరు జిల్లాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం సెలవు ప్రకటించే అవకాశం ఉంది. కేరళలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
3/5బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్.. ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో చఠ్ పూజా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. బీహార్‌లో ఇప్పటికే పాఠశాలలు దీపావళి సెలవుల తర్వాత చఠ్ పూజా వరకు మూసివేయబడ్డాయి.
4/5ఈ రాష్ట్రంలో అక్టోబర్ 28న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు అక్టోబర్ 23 వరకు సెలవులు ప్రకటించగా.. అక్టోబర్ 24న తిరిగి తెరుచుకోనున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇంకా ఒక రోజు అదనపు సెలవు ఇచ్చాయి.
5/5దిల్లీ.. NCR ప్రాంతాల్లోని పాఠశాలలు అక్టోబర్ 19 నుండి 23 వరకు దీపావళి కారణంగా మూసివేయబడ్డాయి. చాలా పాఠశాలలు అక్టోబర్ 24 నుండి తిరిగి ప్రారంభం అవుతాయి… కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం అక్టోబర్ 28 వరకు సెలవు కొనసాగిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పాఠశాలల అధికారిక వాట్సాప్ గ్రూపులు లేదా వెబ్‌సైట్ల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.