Add Zee Business As A Preferred Source
App

6 Heroines: పూజా హెగ్డే తో సాహా..దాదాపు 6 మంది స్టార్ హీరోయిన్స్ కలిసి నటించిన సినిమా.. కట్ చేస్తే ఆ‌ స్టార్ హీరోకి అదొక్కతే హిట్..

Written ByVishnupriya
Published: Sep 24, 2025, 08:36 PM IST|Updated: Sep 24, 2025, 08:36 PM IST

Telugu Star Heroines: టాలీవుడ్‌లో చాలా సినిమాలు ఒక్క హీరోయిన్‌తోనే తెరకెక్కుతాయి. కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు అవసరమవుతారు. మరికొన్ని స్పెషల్ స్టోరీల కోసం ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్‌లు.. కూడా నటిస్తారు. కానీ ఒక సినిమాలోనే ఆరు మంది హీరోయిన్‌లు కలిసి కనిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన సినిమా ఏంటో తెలుసా?

Star Family Hero1/6

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

ఒక సూపర్ హిట్ సినిమాలో ఏకంగా 6 మంది హీరోయిన్లు కలిసి నటించారు. మరో విషయం ఏమిటి అంటే.. స్టార్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ హీరోకి .. తన కెరీర్ మొత్తానికి కేవలం ఆ సినిమా ఒక్కతే విజయం సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..

Six Star Heroines 2/6

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

అది అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్లలో పూజా హెగ్డే లీడ్ రోల్‌లో నటించగా, నేహా శెట్టి, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, కామాక్షి భాస్కర్ల, సాన్వీ మేఘనాలు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. కథ ప్రకారం హీరో పెళ్లి చూపుల్లో పలువురి అమ్మాయిలను కలుసుకుంటాడు. ఆ పాత్రల్లోనే ఈ హీరోయిన్‌లు కనిపించడం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. ముఖ్యంగా నేహా శెట్టి చేసిన క్యామియో ఆడియన్స్‌కి బాగా నచ్చింది.

Star Heroines Movie3/6

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

ఈ సినిమా 2021 అక్టోబర్ 15న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజునుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఇది ఫస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.  

Most Eligible Bachelor Heriones4/6

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

కలెక్షన్ల విషయానికి వస్తే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మొత్తం రూ.19.71 కోట్ల బిజినెస్‌ చేసింది. ఫైనల్ రన్‌లో ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా గ్రాస్, రూ.23.77 కోట్ల షేర్ సాధించింది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభం వచ్చింది. అదే సమయంలో రిలీజ్ అయిన మహాసముద్రం, పెళ్లి సందD సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో అఖిల్ సినిమా విజయవంతమైంది.

Akkineni Akhil Career Hit 5/6

పూజా హెగ్డే

అఖిల్ కెరీర్ మొదటి సినిమాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. చాలా మంది ప్రముఖ డైరెక్టర్లతో పని చేసినా ఫలితం రాలేదు. కానీ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది.  

Akhil Movie Heroines 6/6

పూజా హెగ్డే

మొత్తం మీద, ఒకేసారి ఆరు హీరోయిన్‌లు నటించిన అరుదైన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమా అఖిల్‌కు హిట్ ఇవ్వడమే కాకుండా, టాలీవుడ్‌లోని పలు కొత్త హీరోయిన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించి ప్రత్యేకత సాధించింది.