Add Zee Business As A Preferred Source
App

Tollywood Hit Combinations: హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తోన్న స్టార్ హీరోలు..

Written ByTA Kiran Kumar
Published: Oct 07, 2025, 05:24 AM IST|Updated: Oct 07, 2025, 05:25 AM IST

Tollywood Hit Combinations: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టోరీ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.  ఒక కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ లో ఓ చిత్రం హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు చిత్రాలు నిర్మించడానికి  ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు. 

Balakrishna - Boyapati Sreenu 1/8

బాలకృష్ణ - బోయపాటి శ్రీను

బాలకృష్ణ - బోయపాటి శ్రీను.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో  సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ హిట్స్ టాలీవుడ్ లో ‘అఖండ 2’ రాబోతుంది. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతుంది.  

Nani - Srikanth Odela 2/8

నాని - శ్రీకాంత్ ఓదేల

నాని - శ్రీకాంత్ ఓదేల.. నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో వచ్చిన ‘దసరా’ చిత్రం మంచి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వీళ్ల కాంబినేషన్ లో ‘ప్యారడైజ్’ చిత్రం వచ్చే యేడాది రాబోతుంది.

NTR - Koratala Siva 3/8

ఎన్టీఆర్ - కొరటాల శివ

ఎన్టీఆర్ - కొరటాల శివ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో  'జనతా గ్యారేజ్' తాజాగా ‘దేవర పార్ట్ -1’ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక వీళ్ల కాంబినేషన్ లో ‘దేవర పార్ట్ -2’ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పారు. 2026లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.  

Prabhas - Prashanth Neel 4/8

ప్రభాస్ - ప్రశాంత్ నీల్..

ప్రభాస్ - ప్రశాంత్ నీల్..  ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో  తెరకెక్కిన 'సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1' బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.  త్వరలో కాంబినేషన్‌లో 'సలార్ - 2 శౌర్యంగ పర్వం' రాబోతుంది. 2027లో ఈ  సినిమా రాబోతున్నట్టు సమాచారం. 

Prabhas- Nag Ashwin 5/8

కల్కి పార్ట్ -2..ప్రభాస్ - నాగ్ అశ్విన్..

కల్కి పార్ట్ -2..ప్రభాస్ - నాగ్ అశ్విన్.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమా లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇపుడీ కాంబినేషన్ లో రాబోయే సీక్వెల్ 2027లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.    

Ram Charan - Sukumar 6/8

రామ్ చరణ్ - సుకుమార్

రామ్ చరణ్ - సుకుమార్..  రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మరో చిత్రం రాబోతుంది.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 

Pawan Kalyan - harish Shankar 7/8

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్..

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్..  గబ్బర్ సింగ్ వంటి హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైయిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ చేయనున్నారు. 

Balakrishna - Gopichand Malineni 8/8

బాలకృష్ణ - గోపిచంద్ మలినేని

బాలకృష్ణ - గోపిచంద్ మలినేని..

బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ‘వీరసింహారెడ్డి’ సినిమా తర్వాత మరో సినిమా పట్టాలెక్కబోతుంది.  ఈ నెలలో ఈ  సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుంది.