Tollywood Star Hero Divorce News: తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో పెళ్లి అనేది నీట మీ రాతలే అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో విడాకులనేవి కామన్ అయిపోయాయి. తమలపాకులు ఇచ్చిపుచ్చుకున్నట్టు.. విడాకులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడనే వార్త వైరల్ అవుతుంది.
1/5Tollywood Star Hero Divorce News: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో అంత వేగంగా విడాకులు జరిగిపోతున్నాయి. ఏదో చిన్న చిన్న మనస్పర్థలకే కామన్ పీపుల్ విడిపోతున్నారు.అలాంటి సినీ నటులు కూడా మేము ఏమి తక్కువ తిన్నామా అంటూ భార్యాభర్తల మధ్య చిన్న గొడవలే చినికి చినికి గాలి వానలా మారి విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా సినీ హీరో శర్వానంద్ తన భార్యకు రక్షిత రెడ్డికి విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడనే వార్త వైరల్ అవుతోంది.
2/5శర్వానంద్ టాలీవుడ్ అప్ కమింగ్ హీరో.. ఇతనికి ఫ్యామిలీకి నందమూరి కుటుంబంతో మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. ముందుగా చిన్న పాత్రలతో మెప్పించి ఆ తర్వాత హీరోగా తన రేంజ్ పెంచుకున్నాడు.
3/5టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఇతను తన భార్య రక్షిత రెడ్డికి విడాకులు ఇవ్వబోతున్న వార్త వైరల్ అవుతోంది. వీళ్లిద్దరి పెళ్లి రెండేళ్ల క్రితం 2023 జూన్ లో జరిగింది.
4/5అప్పట్లో వీళ్ల పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు హాజరై వీరిని ఆశీర్వదించారు. గత కొంత కాలంగా శర్వానంద్, రక్షిత వేరు వేరుగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. తాజాగా వీళ్లిద్దరు డైవోర్స్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
5/5రక్షిత రెడ్డి ఫ్యామిలీ విషయానికొస్తే.. ఈమె తండ్రి మధుసూదన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది. తల్లి సుధారెడ్డి. ఈమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అవతుందట. మరి వీళ్లిద్దరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారనే విషయం మాత్రం తెలియరావడం లేదు.