Payal Rajput Marriage
వైవిద్యమైన సినిమాలతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 లాంటి బోల్డ్ సినిమాలు చేసిన ఈమె.. వెంకటేశు వెంకి మామ లాంటి స్టార్ హీరో చిత్రాల్లో కూడా కనిపించింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాయల్ ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతోంది అనే వార్త వైరల్ అవుతుంది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ప్రేక్షకులకు చేరువైన ఆమె, ఆ తర్వాత వెంకటేష్, నాగచైతన్యల ‘వెంకీ మామ’లో నటించి మరింత గుర్తింపు సంపాదించింది.
ప్రస్తుతం ‘వెంకట లచ్చిమి’ చిత్రంలో నటిస్తున్న ఆమె తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన ఫొటోలలో, ఆమె మెహందీ పెట్టుకుని, లెహంగా ధరించి మెరిసిపోతూ కనిపించింది. ఆమె లుక్ పెళ్లికూతురిలా ఉండటంతో నెటిజన్లు పెళ్లి పీటలెక్కబోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆమె దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పాయల్ రాజ్‌పుత్ పంజాబీ నటుడు సౌరభ్‌తో డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు వెకేషన్లకు వెళ్తూ, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పెళ్లిపై వారు ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
‘మంగళవారం’ మూవీ ఘన విజయం సాధించడంతో పాయల్ కెరీర్ మరింత బలపడింది. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘వెంకట లచ్చిమి’లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. మొత్తానికి, పెళ్లి వార్తలపై ఇంకా స్పష్టత లేదు కానీ పాయల్ తాజా ఫొటోలు మాత్రం నెటిజన్లను తెగ ఆలోచింపజేస్తున్నాయి!