School Holiday For Tomorrow In AP On November 8th: సాధారణంగా ఇది వార్త కాదు. కానీ ఏపీలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సెలవు ఉందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఎక్కడెక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ ప్రభావంతో పాఠశాలల సెలవుల క్యాలెండర్‌లో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవగా ఆ సమయంలో దాదాపుగా వారం పాటు విద్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఒక్క 3 జిల్లాలు మినహా ఏపీలోని అన్ని జిల్లాల్లో సెలవులు వచ్చాయి. అప్పుడు ఇచ్చిన సెలవుల సందర్భంగా ఇప్పుడు వచ్చిన రెండో శనివారం పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది.
మొంథా తుఫాను ప్రభావానికి గురి కాని జిల్లాలు మూడు ఉన్నాయి. అనంతపురం, గుంటూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు రెండో శనివారం పాఠశాలలకు యథావిధిగా సెలవు లభిస్తోంది. ఆదివారం సెలవు కూడా ఉండడంతో రెండు సెలవులు కలిసి రానున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రెండు సెలవులు వచ్చాయి.
మిగిలిన 23 జిల్లాల్లో నష్టపోయిన పని దినాలను రెండో శనివారంతో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం ఏపీలోని అనంత, గుంటూరు, సత్యసాయి జిల్లాలు మినహా మిగిలిన 23 జిల్లాల్లో రెండో శనివారం స్కూళ్లు పని చేస్తాయి. శనివారం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాల్సిందే. ఆదివారం యథావిధిగా సెలవు లభించనుంది.
ఏపీలో రెండో శనివారం సెలవుపై గందరగోళం నెలకొనగా విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఉందా? లేదా? అని తికమక పడుతున్నారు. ప్రభుత్వం సెలవు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఈ ఒక్కరోజు పాఠశాలకు పంపించకపోతే ఏమవుతుందనే ధోరణిలో ఉన్నారు.
తెలంగాణలో సెలవులపై ఎలాంటి గందరగోళం లేదు. రెండో శనివారం యథావిధిగా సెలవు ఉంది. ఇక్కడ శని, ఆది రెండు సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో వరుసగా నాలుగు రోజుల సెలవులు ఉన్న విషయం తెలిసిందే. ఛాత్ పూజ కారణంగా బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల సెలవులు కూడా వచ్చాయి.