Who Paid Highest Income Tax Of Indian Film Celebrities: ఆదాయం అధికంగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంది. తమకు వచ్చే సంపాదన, ఆదాయంలో ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో కొంత చెల్లించాలి. మరి భారతదేశ సినీ పరిశ్రమలో అత్యధికంగా ఐటీ చెల్లిస్తున్న హీరోలు ఎవరో తెలుసా?
1/7భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించే నటులు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఆదాయంలో.. సంపాదనలో అత్యధికంగా ఉన్న నటులను ఊహించుకుంటారు. ప్రభుత్వానికి పన్ను చెల్లింపులో కూడా ఆ హీరోలే ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
2/7ఈ టాప్ 10 జాబితాలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ సీనియర్ నటులతో పాటు రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ వంటి యువ నటులు కూడా ఉన్నారు. దక్షిణాది నుంచి విజయ్ మాత్రమే అగ్రస్థానంలో నిలవగా.. సీనియర్ నటులు అజిత్, రజనీకాంత్ వంటి వారి పేర్లు లేకపోవడం గమనార్హం.
3/7ప్రతి పౌరుడు తమ వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. సినీ ప్రముఖులు కూడా తమ సంపాదన, ఆదాయంపై ఆదాయపు పన్ను చెల్లించాలి. అలా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన భారతీయ సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలి స్థానంలో నిలిచాడు.
4/7అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన హీరోల్లో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన విజయ్ నిలిచాడు. షారుఖ్ ఖాన్ రూ.92 కోట్ల ఆదాయపు పన్ను కట్టగా.. విజయ్ రూ.80 కోట్లు ఐటీ చెల్లించారు.
5/7ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లు ఐటీ చెల్లించగా.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రూ.71 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించారు. అజయ్ దేవగణ్ రూ.42 కోట్లు, హృతిక్ రోషన్ రూ.42 కోట్లు ఐటీ చెల్లించారు.
6/7సెన్సేషన్ హిట్ పొందిన యువ నటుడు రణ్‌బీర్ కపూర్ రూ.36 కోట్లు ఐటీ చెల్లించాడు. కపిల్ శర్మ రూ.26 కోట్లు, అందాల భామ కరీనా కపూర్ రూ.20 కోట్లు పన్ను చెల్లించాడు. ఇక షాహిద్ కపూర్ రూ.14 కోట్లు ఆదాయపు పన్ను రూపంలో చెల్లించాడు.
7/7సెన్సేషన్ హిట్ పొందిన యువ నటుడు రణ్‌బీర్ కపూర్ రూ.36 కోట్లు ఐటీ చెల్లించాడు. కపిల్ శర్మ రూ.26 కోట్లు, అందాల భామ కరీనా కపూర్ రూ.20 కోట్లు పన్ను చెల్లించాడు. ఇక షాహిద్ కపూర్ రూ.14 కోట్లు ఆదాయపు పన్ను రూపంలో చెల్లించాడు.