Top 10 Engineering Colleges in AP: ఏపీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లలను జాయిన్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ పేర్కొన్న లిస్టులో ఏపీలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. NIRF యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఇవి టాప్ లో నిలిచాయి. ఈ కాలేజీలలో సీటు కోసం జనరల్ కేటగిరీలో ఎంసెట్ లో ఎంత ర్యాంక్ సాధించాల్సి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం (అటానమస్) రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన యూనివర్సిటీలో ఒకటైన ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్. ఫ్యాకల్టీ విషయంలోనూ, క్యాంపస్ రిక్రూట్మెంట్ లేని విషయంలో ఈ కాలేజీ చక్కటి ప్రమాణాలను పాటిస్తోంది. ఈ కాలేజీలో జనరల్ కేటగిరీలో ఎంసెట్ ద్వారా CSE విభాగంలో సీటు రావాలంటే 1 - 1000 ర్యాంకు మధ్యలో తెచ్చుకోవాల్సి ఉంటుంది.
JNTU కాకినాడ (అటానమస్) జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉండే జేఎన్టీయూ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ అటు ఫ్యాకల్టీ పరంగాను క్యాంపస్ రిక్రూట్మెంట్ పరంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా జనరల్ కేటగిరీలో CSE విభాగంలో సీటు రావాలంటే 1 – 1500 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ (AUW), వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఈ మహిళ ఇంజనీరింగ్ కాలేజీలో చక్కటి ఫ్యాకల్టీ, లేబరేటరీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా CSE విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు సాధించాలంటే 1 – 2500 ర్యాంకుల మధ్యలో సాధించాల్సి ఉంటుంది.
గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వైజాగ్ (GVP) వైజాగ్ కు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. . ఈ కాలేజీ కూడా టాప్ కాలేజీలో ఒకటిగా నిలిచింది. ఎంసెట్ ద్వారా ఈ కాలేజీలో CSE విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు తెచ్చుకోవాలంటే 1 – 4000 ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
SRKR ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్నటువంటి సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్ రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా నిలిచింది. ఈ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ లతోపాటు, ఫ్యాకల్టీ పరంగా చక్కటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నాయి. ఎంసెట్ ద్వారా ఈ కాలేజీలో CSE విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు సాధించాలంటే 1 - 6000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరు గుంటూరులో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చక్కటి ప్రమాణాలను కలిగి ఉంది. ఉన్నతమైన ఫ్యాకల్టీ, అలాగే లేబొరేటరీ ఫెసిలిటీస్ పరంగా ఈ కాలేజ్ చక్కటి ప్రమాణాలను పాటిస్తోంది. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా CSE విభాగంలో సీటు సాధించాలంటే జనరల్ కేటగిరీలో 1 – 7000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT), గుంటూరు గుంటూరులో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా ఉంది. ఈ కాలేజీలో సీటు సాధించాలంటే ఎంసెట్లో CSE విభాగం కోసం జనరల్ కేటగిరీలో 1 – 7000 ర్యాంకుల మధ్యలో సాధించాల్సి ఉంటుంది.
ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, సూరంపాలెం రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఈ కళాశాలలో ఎంసెట్ ద్వారా CSE విభాగంలో సీటు సాధించాలి అనుకుంటే జనరల్ కేటగిరీలో 1 – 9000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గుంటూరు రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఈ కాలేజీ పేరు సంపాదించుకుంది. ఇందులో CSE విభాగంలో ఎంసెట్ ద్వారా సీటు సాధించాలి అనుకుంటే జనరల్ కేటగిరీలో 1 – 5000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
VIT-AP విశ్వవిద్యాలయం (ప్రైవేట్ - VITEEE లేదా AP EAMCET ద్వారా ప్రవేశం) రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా సీటు సాధించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా CSE విభాగంలో సీటు కోసం జనరల్ కేటగిరీలో 1 – 7000 మధ్యలో ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది.