Telangana: తెలంగాణలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. ఈ కాలేజీలకు ఎందుకంత క్రేజ్..ప్లేస్ మెంట్స్ ఉంటాయా ? ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది..?

Top 10 Engineering Colleges in Telangana: ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రవేశాలు ప్రారంభమవుతున్నాయి విద్యార్థులు ఏ కాలేజీలో చేరితే మంచిది అని అటు తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అందులోనూ ప్రత్యేకంగా హైదరాబాదులో టాప్ కాలేజీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఈ కాలేజీలో అటు  NIRF ర్యాంకింగ్స్ పరంగాను, ఫ్యాకల్టీ పరంగాను చక్కగా రాణిస్తున్నాయి. 
 

1 /10

CBIT (Chaitanya Bharathi Institute of Technology)  ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కాలేజీ నెంబర్ వన్ ర్యాంకింగ్ పొందింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే కావడం విశేషం. ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ విషయంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది.  Infosys, TCS, Deloitte వంటి సంస్థలు ఈ కాలేజీ విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించాయి. NIRF ర్యాంకింగ్స్ లో కూడా మంచి స్థానం పొందింది. 

2 /10

Vasavi College of Engineering : హైదరాబాదులోని టాప్ కాలేజీల్లో ఒకటైన వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫ్యాకల్టీ పరంగాను, మౌలిక వసతుల పరంగా, మంచి పేరు సంపాదించుకుంది. ఈ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా విద్యార్థులు ఎంపికై వాళ్ళు మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నారు.   

3 /10

JNTU Hyderabad (Jawaharlal Nehru Technological University): జె.ఎన్.టి.యు యూనివర్సిటీకి చెందిన ఈ ఇంజనీరింగ్ కాలేజీ రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ పరంగా చక్కటి ట్రాక్ రికార్డును కలిగి ఉంది.   

4 /10

VNR Vignana Jyothi Institute of Engineering : రాష్ట్రంలోనే టాప్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఈ కాలేజీ ఇంటర్న్ షిప్స్ పరంగా చక్కటి అవకాశాలను విద్యార్థులకు కల్పిస్తోంది. ఇండస్ట్రీ వర్గాలతో నేరుగా ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమైనటువంటి అనుభవం ఈ కాలేజీకి ఉంది.   

5 /10

Gokaraju Rangaraju Institute of Engineering and Technology (GRIET):  నగరంలోని టాప్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ పరంగాను, మౌలిక వసతుల పరంగాను చాలా మంచి పేరు సంపాదించుకుంది NIRF ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ సంపాదించుకుంది.   

6 /10

నగరంలోని టాప్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రస్తుతం ఫ్యాకల్టీ పరంగాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను మంచి పేరు సంపాదించుకుంది. Capgemini, Cognizant వంటి సంస్థలు ఇక్కడ విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసుకున్నాయి.   

7 /10

సిటీలోని టాప్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రస్తుతం ఫ్యాకల్టీ పరంగాను అలాగే మౌలిక వసతుల పరంగాను చక్కటి లాబరేటరీ, అలాగే ఇతర సదుపాయాల్లో చక్కటి పేరు సంపాదించుకుంది.

8 /10

ప్రస్తుతం యూనివర్సిటీ హోదా పొందినటువంటి అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ పరంగాను మౌలిక వసతుల పరంగా పేరు సంపాదించుకుంది. 

9 /10

నగర శివార్లలో ఉన్నటువంటి ఈ కాలేజీ అటు ఫ్యాకల్టీ పరంగాను మౌలిక వసతుల పరంగాను చక్కటి పేరు సంపాదించుకోవడం మాత్రమే కాదు. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా ఇక్కడ విద్యార్థులు తమ సత్తా చాటుకున్నారు. 

10 /10

నగరంలోని టాప్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఎంజీఐటి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీతో అనుబంధంగా పనిచేస్తోంది. ఇక్కడి CSE, IT, ECE బ్రాంచ్‌లలో ప్లేస్ మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి.