Best selling scooters: మీరు కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా మీ బడ్జెట్ లోనే ఉండాలనుకుంటున్నారా? అయితే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 3 స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కూటర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
Best selling scooters: దేశంలో స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. మధ్యతరగతి ప్రజలతోపాటు యువత కూడా ఇప్పుడు బైక్‌ల కంటే స్కూటర్లను నడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కంపెనీలు కూడా కొత్త మోడళ్లు మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. గత నెలలో (ఫిబ్రవరి 2025) అత్యధికంగా అమ్ముడైన టాప్ 3 స్కూటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తుంటే ఈ స్టోరీ మీకోసమే.
సుజుకి యాక్సెస్ 125 టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. గత నెలలో ఈ స్కూటర్ 59,039 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 56,473 యూనిట్లు. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, కొత్త సుజుకి యాక్సెస్ 125 లో 124cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 8.4bhp శక్తిని 10.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌కి జతచేసి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే స్కూటర్ ఇంజిన్‌ను అప్ డేట్ చేసింది. యాక్సెస్ 125 ధర రూ. 81,700 నుండి ప్రారంభమవుతుంది.
టీవీఎస్ జూపిటర్ దేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన స్కూటర్. ఈ స్కూటర్ ఇప్పుడు హోండా యాక్టివాకు గట్టి పోటీని ఇస్తోంది. గత నెలలో, జూపిటర్ 1,03,576 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జూపిటర్ 73,860 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈసారి కంపెనీ ఈ స్కూటర్‌లో 29,716 యూనిట్లను విక్రయించింది. కొత్త జూపిటర్ 110 స్కూటర్‌లో ఇప్పుడు కొత్త ఇంజిన్‌ను అమర్చారు. ఈ స్కూటర్ 113.3cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. 5.9kw పవర్, 9.8 NM టార్క్‌ను అందిస్తుంది. దీనికి CVT గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కి.మీ. జూపిటర్ 110 ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,700.
ఎప్పటిలాగే, ఈసారి కూడా 1,74,009 యూనిట్ల హోండా యాక్టివా అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 2,00,134 యూనిట్ల యాక్టివా స్కూటర్లను విక్రయించింది. ఈసారి ఈ స్కూటర్ 26,125 యూనిట్లు తక్కువ అమ్ముడయ్యాయి. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, యాక్టివాలో 110cc OBD2B కంప్లైంట్ ఇంజిన్ అమర్చింది. ఈ ఇంజన్ 5.88 kW శక్తిని, 9.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధనాన్ని ఆదా చేయడానికి, స్కూటర్‌లో ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ అందించింది. హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,950 నుండి ప్రారంభమవుతుంది.