Visa Options For Indians: ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వం H-1B వీసా ఫీజును చాలా ఎక్కువ చేసింది. కొత్త నియమాల ప్రకారం ఒక్కో అప్లికేషన్‌కి దాదాపు 88 లక్షల రూపాయల ఫీజు.. చెల్లించాలి. ఇది సాధారణ ఉద్యోగులు భరించలేని మొత్తం. అందుకే ఇప్పుడు చాలా మంది భారతీయులు అమెరికా బదులు ఇతర దేశాలను చూసుకుంటున్నారు. ఆ దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1/5కెనడా ఎప్పటినుంచో భారతీయులకి ఉన్న మొదటి ఆప్షన్. ఇక్కడ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ (FSWP) ద్వారా సులభంగా వీసా దొరుకుతుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్థిర నివాసం (Permanent Residency) కూడా తేలికగా లభిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక కెరీర్ కోసం కెనడా ఉత్తమమైన ప్రదేశం.
2/5యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక శక్తి జర్మనీ. ఇక్కడ తయారీ, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు విస్తృతంగా ఉంటాయి. జాబ్ సీకర్ వీసా ద్వారా ఆరు నెలలు దేశంలో ఉండి ఉద్యోగం వెతకవచ్చు. ఉద్యోగం దొరికిన వెంటనే వర్క్ పర్మిట్ పొందొచ్చు. అంతేకాక, యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ ద్వారా దీర్ఘకాలం జర్మనీలో పని చేసి జీవించే అవకాశం ఉంటుంది.
3/5ఆసియాలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న దేశం సింగపూర్. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ పాస్ (EP) అనే వీసా సులభంగా దొరుకుతుంది. ఐటీ, బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. వీసా ప్రక్రియ సులభంగా ఉండటం, జీతాలు ఎక్కువగా ఇవ్వడం వలన సింగపూర్ భారతీయులకు ఆకర్షణీయంగా మారింది.
4/5భారతీయులకి అత్యంత దగ్గరలో ఉండే దేశం UAE. ఇక్కడ వీసా పొందడం సులభం. ముఖ్యంగా ఇంకమ్ ట్యాక్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులు ఇక్కడికి వెళ్తున్నారు. ఐటీ, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉన్నాయి. భారత్‌కి దగ్గరగా ఉండటం కూడా ఒక ప్లస్ పాయింట్.
5/5ఆస్ట్రేలియా జీవన ప్రమాణాలు చాలా మంచి స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ జనరల్ స్కిల్డ్ మైగ్రేషన్ (GSM) ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యం ఉన్నవారు సులభంగా వీసా పొందొచ్చు. అలాగే టెంపరరీ స్కిల్ షార్టేజ్ వీసా కూడా ఉంది. ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.