Top 5 Gold Mines In India: భారతదేశం ఉప ఖండం అని పిలుస్తారు. ఎందుకంటే అన్నీ సహజ వనరులు మనదేశంలో ఉన్నాయి. వాటిలో ఖనిజ సంపద ఒకటి. ఖనిజ సంపదలో బంగారం అత్యంత విలువైనది. భారతదేశంలో ఎన్ని ప్రముఖ బంగారు గనులు ఉన్నాయో తెలుసుకుందాం. ఆ బంగారు గనుల విలువ ఎంతో చూద్దాం.
1/6భారతదేశ ప్రజలు బంగారాన్ని ఎంతో ఇష్టపడతారు. ఖనిజ సంపదలో బంగారం కూడా ముఖ్యమైన ఖనిజం. భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, సంప్రదాయాలలో బంగారం విశిష్ట స్థానం పొందింది. అలాంటి బంగారం ఎక్కడ లభిస్తోంది? దేశంలో ఎన్ని గనులు ఉన్నాయో తెలుసుకుందాం.
2/6భారతదేశంలో అత్యధికంగా బంగారు గనులు కర్ణాటకలో ఉన్నాయి. కన్నడ గడ్డ బంగారు గనులకు కేంద్రంగా నిలిచింది. దేశంలో అత్యంత ప్రధానమైనది కోలార్ బంగారు గనులు. దీనినే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్). ఈ బంగారు గనులు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. బ్రిటిష్ కాలంలో విస్తృతంగా తవ్వకాలు జరిపిన ఈ బంగారు గనులు ప్రస్తుతం కొన్ని కారణాలతో మూసివేశారు.
3/6కర్ణాటకలో మరో బంగారు గనులు హట్టి గోల్డ్ మైన్స్. ప్రస్తుతం దేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్న బంగారు గని ఇది. రాయచూర్ జిల్లాలో ఉన్న ఈ గనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. దేశ బంగారు ఉత్పత్తిలో హట్టి గనులు ప్రధానంగా ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తూ ఇక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి.
4/6తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారు గనులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతం పూర్వకాలంలో బంగారు తవ్వకాలకు ప్రసిద్ధి. కడప, చిత్తూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు గుర్తించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి ప్రాంతం కూడా చారిత్రకంగా బంగారు గనులకు ప్రసిద్ధి ఉంది. కానీ ఇప్పుడు అక్కడ బంగారు తవ్వకాలు చేపట్టడం లేదు.
5/6దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా బంగారు గనులు ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌భూమ్ జిల్లా, రాజస్థాన్‌లోని బనాస్‌వారా, ఉదయ్‌పూర్ ప్రాంతాలు, కేరళలోని వయనాడు జిల్లా మొదలైన ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలపై ఆంక్షలు ఉన్నాయి. ఈ బంగారు గనుల్లో విస్తృతంగా తవ్వకాలు చేపట్టడం లేదు.
6/6బంగారు గనులు తవ్వడం సాధారణ విషయం కాదు. బంగారు తవ్వకాలు అనేక సవాళ్లతో కూడుకున్నది. లోతైన గనులు, అధిక వ్యయం, పర్యావరణ సమస్యలు, ఆధునిక సాంకేతిక అవసరాలు వంటి అంశాలు బంగారు గనుల్లో తవ్వకాలు చేయాల్సి ఉంది. విదేశాల నుంచి బంగారం దిగుమతిపై ఆధారపడిన భారతదేశం దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపడుతోంది.