Best Diabetic Fruits: డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. అందుకే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు బెస్ట్ 5 ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..
నిమ్మకాయ నిమ్మ గ్లైసెమిక్ ఇండెక్స్ మరింత తక్కువ. కేవలం 20 ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా పెద్దఎత్తున ఉంటుంది. శరీరం ఇమ్యూనిటీని పెంచుతుంది. నిమ్మ రసం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.
ఆపిల్ ఆపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ 38 ఉంటుంది. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఇది చాలా మంచిది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. ఆపిల్ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుతాయి. బరువు నియంత్రణలో దోహదపడుతుంది
ఆరెంజ్ ఆరెంజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ 40 వరకు ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంతో పాటు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది
బొప్పాయి బొప్పాయి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. ఇంటర్నల్ స్వెల్లింగ్ తగ్గిస్తుంది. డయాబెటిస్ సంబంధించిన ముప్పు తగ్గిస్తుంది
జామ జామలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా తక్కువ. దాంతోపాటు ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా ఉపయోగం. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి