Add Zee Business As A Preferred Source
App

Blood Pressure Supplements: రక్తపోటు నియంత్రించేందుకు.. ఎంతో ఉపయోగకరమైన సహజ సప్లిమెంట్స్ ఇవే..

Written ByVishnupriya
Published: Oct 05, 2025, 06:56 PM IST|Updated: Oct 05, 2025, 06:56 PM IST

BP Control : మన హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రక్తపోటును సహజ రీతిలో నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)..ఎక్కువగా ఏ లక్షణాలు లేకుండానే శరీరంలో నష్టం చేస్తుంది. ఇది కాలక్రమంలో గుండె.. కిడ్నీలకు హానికరంగా కూడా మారుతుంది. అయితే వీటిని నియంత్రించడానికి కొన్ని సహజమైన సత్యం తీసుకోవడం ఎంతో ముఖ్యం. బిపి మందులతో మందులతో పాటు ఈ సహజ పదార్థాలు కూడా ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Beetroot1/5

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్లు రక్తనాళాలను సడలించి రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. రోజుకు సుమారు 350–400 మి.గ్రా నైట్రేట్ తీసుకుంటే రక్తపోటు.. తగ్గుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గంగా భావిస్తున్నారు.

Magnesium2/5

మాగ్నీషియం

రోజుకు 300–400 మి.గ్రా మాగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది కండరాలు, నాడులు.. గుండె పనితీరును సరిగా ఉంచుతుంది. ఆకుకూరలు..విత్తనాలు.. నట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా మెగ్నీషియం అందిస్తాయి.  

CoQ103/5

కోక్యూతెన్

ఇది శరీరంలోని కణాలకు శక్తినిచ్చే యాంటీ ఆక్సిడెంట్. దీన్ని 100–300 మి.గ్రా మోతాదులో తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Omega-34/5

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్

సామన్, మాక్రెల్ వంటి చేపల్లో ఇవి విరివిగా ఉంటాయి. రోజుకు 2–3 గ్రాముల మోతాదులో తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.. రక్తపోటును కొద్దిగా తగ్గిస్తుంది.

Hibiscus Tea5/5

హిబిస్కస్ టీ

రోజుకు రెండు సార్లు ఒక కప్పు హిబిస్కస్ టీ తాగడం రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన హర్బల్ డ్రింక్.