Smartphones With Huge Discounts: ప్రసిద్ధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ సెప్టెంబర్ 23, 2025 నుండి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనున్నది. ఈ సేల్‌లో Samsung, Apple, OnePlus, iQOO, Xiaomi, realme వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్, గాడ్జెట్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు రానున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ అభిమానులు తమ ఇష్టమైన ఫోన్లను చీప్ ధరల్లో కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్నారు. మరి ఏ ఫోన్లో అత్యంత తక్కువ ధరకు రానున్నాయి అంటే..
1/5ఈ సేల్‌లో ఈ ఫోన్ కేవలం.. ₹71,999కు లభిస్తుంది. 9 నెలల నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో టైటానియం ఫ్రేమ్, Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
2/5ఐఫోన్ 15 కూడా ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణ. దీన్ని ₹45,249కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా ₹1,750 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. iPhone 15లో 48MP మెయిన్ కెమెరా, A16 Bionic చిప్, మరియు 6.1 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే ఉన్నాయి.
3/5OnePlus 13R ధర ₹35,999, అదనంగా ₹2,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల నో-కాస్ట్ EMI సౌలభ్యం కూడా ఉంది. 6,000mAh బ్యాటరీ, 1.5K ProXDR 120Hz డిస్‌ప్లే.. 50MP Sony కెమెరా ఫీచర్లు ఫోటోగ్రఫీ.. అన్నీ కూడా సెల్ఫోన్ అభిమానులకు పర్ఫెక్ట్ గా నిలవనుంది.
4/5iQOO Neo 10R 5G ధర ₹23,999, అదనంగా ₹3,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజ్, 1.5K 144Hz AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో నిండి ఉన్న ఈ సెల్ ఫోన్..మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.
5/5బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్స్‌లో Redmi A4 5G (₹7,499, 6.88-inch HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5,160mAh బ్యాటరీ).. realme NARZO 80 Lite 5G (₹9,999, 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్) ప్రథమ స్థానాలలో నిలువలు ఉన్నాయి.