Know Richest Couples In Film Industry From South India: సినీ పరిశ్రమ కాసులు కురిపించేది. ముఖ్యంగా హీరో హీరోయిన్లు కోటాను కోట్లు సంపాదిస్తుంటారు. ఒకే పరిశ్రమ నుంచి పెళ్లి చేసుకున్నవారైతే వారి సంపాదన మరింత ఎక్కువగా ఉంటుంది. మరి సినీ పరిశ్రమలో ఉన్న భార్యాభర్తలు అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా?
భారతీయ సినీ పరిశ్రమలో దక్షిణ సినీ పరిశ్రమ విశ్వవ్యాప్తమవుతోంది. హిందీకి దీటుగా దక్షిణ సినీ పరిశ్రమ సత్తా చాటుతోంది. మరి సంపాదన, ఆస్తుల్లోనూ సౌత్ ఇండస్ట్రీ టాప్‌లో ఉంటోంది. దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో అత్యంత ధనిక సినీ జంటలు ఉన్నాయి. మరి ఆ ధనిక జంటలు ఎవరో తెలుసుకుందాం.
దక్షిణ భారత సినీ పరిశ్రమ నుంచి అత్యంత ధనవంతుల జాబితాలో తెలుగు హీరో రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల జోడీ తొలి స్థానంలో ఉంది. చెర్రీ - ఉపాసన దంపతులకు భారీగా ఆస్తులు ఉన్నాయి. రామ్ చరణ్‌తోస సమానంగా ఉపాసన ఆస్తులు కలిగి ఉన్నారు. రామ్ చరణ్ సినిమాలు, వ్యాపారాలతో సంపాదిస్తుంటే.. భార్య ఉపాసన కామినేని, అపొలో ఆస్పత్రులతోపాటు అనేక పెట్టుబడులు పెట్టారు. వాటి ద్వారా ఉపాసన, చెర్రీ భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు. చెర్రీ, ఉపాసన జోడీ ఆస్తులు దాదాపు రూ.2,500 కోట్లు ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అలనాటి హీరో అక్కినేని నాగేశ్వర్ రావు వారసుడిగా వచ్చిన నాగార్జున సినీ పరిశ్రమలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. నాగార్జునకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. నాగార్జునతోపాటు ఆయన భార్య అమల ఆస్తులు కలిపితే దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత ధనిక జంటల జాబితాలో టాప్-2లో ఉన్నారు. నాగ్, అమల ఆస్తుల విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
పుష్పతో తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటిన నటుడు అల్లు అర్జున్. తెలుగులో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఆస్తుల్లో దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. అల్లు అర్జున్ తన భార్య స్నేహలు భారీగా సంపాదించారు. అత్యంత ధనవంతుల జాబితాలో బన్నీ జోడీ మూడో స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్, స్నేహా ఆస్తుల విలువ దాదాపు రూ.600 కోట్లు ఉంటుందని సమాచారం.
తమిళ సినీ పరిశ్రమలో అందమైన జంట జ్యోతిక - సూర్య. ఈ జంట ఆస్తిపాస్తులు భారీగా సంపాదించింది. సూర్య - జ్యోతిక అత్యంత ధనవంతుల జాబితాలో 4వ స్థానంలో నిలవగా.. వారి ఆస్తులు దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంటుందని కోలివుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన అజిత్ కుమార్ - శాలిని జంట అత్యంత ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. తమిళ సినిమాలోని అగ్ర నటులలో ఒకరిగా ఉన్న అజిత్ ఇటీవల కార్ రేసుల్లో కూడా పాల్గొంటున్నారు. అజిత్, శాలిని జంటకు దాదాపు రూ.450 నుంచి రూ.500 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.
కేజీఎఫ్‌తో సంచలన విజయాన్ని అందుకున్న యష్ ఆస్తుల్లోనూ సంచలనం రేపుతున్నాడు. యశ్- రాధిక పండిట్ జోడీకి భారీగా ఆస్తులు ఉన్నాయి. వారికి దాదాపు రూ.500 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయని కన్నడ ఇండస్ట్రీ చెబుతోంది.
దక్షిణ సినీ పరిశ్రమ నుంచి పరిశీలిస్తే తెలుగు నుంచి మహేశ్ బాబు - నమ్రతా శిరోద్కర్ జంట ఆఖరి స్థానంలో నిలుస్తున్నారు. మహేష్ - నమ్రతా జంట అత్యధికంగా సంపాదించారు. వారిద్దరూ సౌత్ నుంచి అత్యంత ధనిక జంట జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు. వారి ఆస్తుల విలువ రూ.450 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.