Top movies on against Terrorism: భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిన టాప్ సినిమాలు..

Top 10 movies on against Terrorism: జమ్మూ కశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ జరిగిన ఉగ్రదాడితో భారత దేశం ఉలిక్కి పడింది. అయితే.. దీనికి మన దేశం గట్టి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. అంతేకాదు ఉగ్రవాదం అంతానికి మన దేశంలోని జాతీయ వాద ప్రభుత్వం కంకణ బద్దులైంది. ఈ  నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గత కొన్నేళ్లులో వచ్చిన చిత్రాల విషయానికొస్తే..

1 /8

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2016): ఈ చిత్రం 2016 పఠాన్ కోట్ లోని  ఉరి ఆర్మీ స్థావరంపై జరిగిన ఉగ్రదాడి జరిగింది. దానికి  ప్రతీకారంగా   భారత సైన్యం పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కింది.

2 /8

మేజర్ (2022): మన దేశంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కింది.  ఈ సినిమా మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ నేపథ్యంలో తెరకెక్కింది.

3 /8

ది అటాక్స్ ఆఫ్ 26/11 (2013): రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2008 ముంబై దాడుల భయానక సంఘటనలను నేపథ్యంలో తెరకెక్కింది.

4 /8

అమరన్ : శివకార్తీకేయన్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కింది.  

5 /8

విజయేంద్ర వర్మ: బాలకృష్ణ హీరోగా స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉగ్రవాద వ్యతిరేక నేపథ్యంలో  తెరకెక్కింది. ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. అటు పరమవీరచక్ర కూడా దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కింది.

6 /8

బ్లాక్ ఫ్రైడే (2007): 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల దర్యాప్తు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

7 /8

సర్ఫరోష్ (1999): ఆమిర్ ఖాన్ నటించిన ఈ చిత్రం, సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక పోలీసు అధికారి పోరాటం నేపథ్యంలో తెరకెక్కింది.

8 /8

అటు 2000లో వచ్చిన మిషన్ కశ్మీర్, ఫనా, న్యూయార్క్,  మై నేమ్ ఈజ్ ఖాన్, ఖుర్బాన్, దిల్ సే, రోజా, దిల్ సే, ద్రోహి తదితర చిత్రాలు ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కినవే. ఇందులో మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి.