Traffic diversions in Tirumala: తిరుమలలో నేటి రాత్రి నుంచి భారీగా ట్రాఫిక్ డైవర్షన్ ఉండనుంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు కీలక సూచనల్ని చేసింది. అంతేకాకుండా ముఖ్యంగా టూవీలర్ మీద కొండకు రావాలనుకునేవారికి కీలక సూచనల్ని చేసింది.
1/6తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి . ప్రతిరోజు కూడా భారీగా భక్తులు కొండకు తరలి వస్తున్నారు. టీటీడీ పాలక మండలి, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినత తర్వాత బ్రహ్మోత్సవాలు రావడంతో చంద్రబాబు సర్కారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
2/6సామాన్య భక్తులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తు బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ సిఫారసుల్ని టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. అంతే కాకుండా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రేపు ఆదివారం శ్రీవెంకటేశ్వరస్వామి వారు గరుడ వాహనంపై విహరిస్తు స్వామి వారు.. తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
3/6పురాణాల ప్రకారం గరుడ వాహన సేవ స్వామివారికి అత్యంత ప్రీతికరమైందని, దీని కోసం దేవతలు సైతం భూమి మీదకు వచ్చి స్వామి వారి వాహన సేవల్ని తిలకిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు.ఈ క్రమంలో ఆదివారం జరగనున్న గరుడ వాహన సేవ నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ చర్యలు తీసుకుంది. శనివారం రాత్రి నుంచి తిరుమలలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించింది. అదే విధంగా టూవీలర్ వాహనాల్ని నేటి రాత్రి నుంచి 29 వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో అనుమతించబోమని తెలిపింది. అలిపిరి పాత చెక్ పోస్ట్ వద్ద.. టూవీలర్ ల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించబడిందని టీటీడీ వెల్లడించింది..
4/6తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు.. రాంభగీచ పార్కింగ్: వీవీఐపి పెద్ద బ్యాడ్జెస్ వాహనాలను, సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్: విఐపి చిన్న బ్యాడ్జెస్ వాహనాలు, సాధారణ వాహనాలు: ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు పార్కింగ్ చేసుకోవాలని సూచనలు చేశారు. తిరుపతి నుండి తిరుమల వరకు ఏపీఎస్ ఆర్టీసీ,టీటీడీ ప్రత్యేక బస్సులు నిరంతరం నడపబడతాయి. భక్తులు వీటినే వినియోగించాలన్నారు.
5/6అలిపిరి – కపిలతీర్థం మార్గం – భక్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఉంచబడింది. ముఖ్యంగా.. ప్రైవేట్ వాహనాలు – కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలోనే నిలిపి ఉంచాలి. రోడ్ల పక్కన, అనధికారిక ప్రదేశాలలో వాహనాలు నిలపరాదని తెలిపారు. భక్తులందరూ పోలీస్ శాఖ, TTD సిబ్బంది, వాలంటీర్లకు సహకరించాలని, ఏదైన ఇబ్బందులుంటే టీటీడీ నంబర్ లకు సంప్రదించాలని అధికారులు కోరారు. మరోవైపు వీధి వ్యాపారులకు మాత్రం ప్రధాన రహదారులపై అనుమతిలేదని అధికారులు స్పష్టం చేశారు.
6/6ముఖ్యంగా టూవీర్ వాహనాలు.. కడప, శ్రీకాళహస్తి వైపు నుండి వచ్చే టూవీలర్ వాహనాలకు ఇస్కాన్ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్ లలో టూ వీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇంకా.. దేవలోక్ ప్రాంగణంలో , భారతీయ విద్యాభవన్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లలో ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. తిరుమలకు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణించే యాత్రికులు, నంది సర్కిల్, గరుడ సర్కిల్ మార్గం గుండా యథాప్రకారం తిరుమలకు వెళ్తారన్నారు. తిరుపతి నుండి తిరుమలకు చేసుకోవడానికి 24/7 RTC బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనది.