Add Zee Business As A Preferred Source
App

TRAI: టెలికాం కంపెనీలకు బిగ్‌ షాక్‌.. 1GB ప్లాన్స్‌ ఎందుకు తొలగించారని ట్రయ్‌ ప్రశ్న..! కారణం ఇదే..

Written ByRenuka Godugu
Published: Sep 13, 2025, 01:37 PM IST|Updated: Sep 13, 2025, 01:37 PM IST

TRAI questions Jio airtel:టెలికాం కంపెనీలకు ట్రయ్‌ బిక్‌ షాక్‌ ఇచ్చింది. సరసమైన ధరలో అందుబాటులో ఉండే 1gb ఎంట్రీ లెవెల్ ప్రిపేయిడ్‌ ప్లాన్స్ ఎందుకు ఉపసంహరించుకున్నాయి అని ప్రశ్నించింది. దీనికి కారణాలు తెలపాలని జియో, ఎయిర్‌టెల్ సంస్థలను ట్రయ్‌ కోరింది. దీనికి టెలికాం కంపెనీలు కూడా దీనికి వివరణ ఇచ్చాయి. ప్రధానంగా రూ.249 ప్లాన్ ఎత్తేయడం పై వినియోగదారులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
 

Telecom Price1/5

టెలికాం ధర

 వరుసగా పెరుగుతున్న టెలికాం ధరల నేపథ్యంలో వినియోగదారులపై భారమే పడుతుంది. ప్రస్తుతం ఎంట్రీ లేవల్‌ రూ.299 ఉండటంతో ఇది టెలికాం యూజర్‌కు పెనుబారంగా మారనుంది. ఈ నేపథ్యంలో ట్రయ్‌ ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు ఎంట్రీ లెవెల్ రీఛార్జ్ ప్లాన్ ఉపసంహరణపై ప్రశ్నించింది.  

TRAI2/5

ట్రయ్‌

ప్రధానంగా సరసమైన ధరలు అందుబాటులో ఉండే 1 జీబీ ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ ఎందుకు ఉపసంహరించుకోవాల్సిన కారణాలు తెలపాలని జియో, ఎయిర్‌టెల్ సంస్థలను ట్రయ్‌ కోరింది. అయితే రూ.249 ప్లాన్ ఎత్తివేయడం పై వినియోగదారులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  

Jio3/5

జియో

 అయితే దీనికి జియో ఈ ప్లాన్స్ ఆఫ్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎయిర్‌టెల్ మాత్రం రూ.249 వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగానే తీసేసినట్లు పేర్కొంది ప్రస్తుతం ఈ టెలికాం ఎంట్రీ లెవెల్ ప్లాన్స్‌ రూ.299 నుంచి మొదలవుతున్నాయి.  

Telecommunications4/5

టెలికమ్యూనికేషన్స్

ఈ బేసిక్ రీఛార్జి ప్లాన్స్ ని తొలగించడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కూడా ట్రయ్‌ని దీని గురించి ఎంక్వయిరీ చేయమని అడిగింది. అయితే గతంలో జియో ల్ రూ. 249 రీఛార్జి ప్లాన్స్ తో 28 రోజుల వ్యాలిడిటీ ప్రతిరోజు 1 జీబీ డేటా అందించేది. ఇదే ప్లాన్ ఎయిర్‌టెల్ అయితే 24 రోజుల వ్యాలిడిటీ తో ప్రతిరోజు 1 జీబీ డేటా అందించేది.  

Recharge Plan5/5

రీఛార్జ్ ప్లాన్

అయితే ఈ ఎంట్రీ లెవెల్ రీఛార్జ్ ప్లాన్ ని తొలగించి నేపథ్యంలో డేటా ఎక్కువగా వినియోగించని వారిపై కాస్త భారం పడేలా ఉంది. కొంతమంది కేవలం డైలీ  అంత పెద్దగా డేటా వినియోగించక పోవచ్చు. అలాంటివారికి 1 జీబీ డేటా ఎంతగానో ఉపయోగకరంగా ఉండేది. కాస్త జీబీ అపరిమిత వాయిస్ కాలింగ్ కోరే వినియోగదారులకు పెనుబారమే.