Trigrahi Yogam: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అద్భుత రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అందులో త్రిగ్రాహి యోగం ఒకటి. ఒక రాశిలో మూడు గ్రహాల కలయికతో వల్ల ఏర్పడే త్రిగ్రాహి యోగం 100 యేళ్ల తర్వాత దీపావళి రోజున ఏర్పడబోతుంది.దీంతో మూడు రాశుల వారికి దశ, దిశ మారబోతున్నట్టు గ్రహా సంచారం చెబుతుంది.
1/6Trigrahi Yogam: ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ యేడాది దీపావళి అక్టోబర్ 20న జరుపుకోవడం జరుపుకుంటున్నారు దేశ ప్రజలు. ఈ యేడాది దీపావళి జ్యోతిష దృక్కోణం నుండి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వ్యాపారానికి అధిపతి బుధుడు, ధైర్యం, క్రమశిక్షణకు చిహ్నమైన కుజుడినతో పాటు అందం ఆకర్షణకు చిహ్నమైన శుక్రుడిని ఏకం చేస్తుంది. దీపావళి నాడు, త్రిగ్రహి యోగం తులారాశిలో ఏర్పడుతుంది.
2/6ఈ త్రిగ్రాహి యోగం 12 రాశులన్నింటినీ ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ సమయంలో, మూడు రాశుల వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకురాబోతుంది. వారు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందే అవకాశం ఉంది.
3/6మకర రాశి: దీపావళి రోజున ఏర్పడిన ఈ త్రిగ్రాహి యోగం వలన మకరరాశి వారికి ఇదే మంచి తరుణం. ఈ యోగం మకరరాశి కర్మ అంశంలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో, మకరరాశి వారి పని, వ్యాపారంలో పురోగతిని అందుకుంటారు. కొత్త వ్యాపార అవకాశాలు అందుకుంటారు. పాత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న స్థానానికి బదిలీ చేయబడవచ్చు.
4/6తుల రాశి: ఈ త్రిగ్రాహి యోగం తులారాశిలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ యోగం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ యోగం లగ్న తులారాశిలో ఏర్పడుతుంది.ఫలితంగా, తులారాశి వారు ఈ సమయంలో వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు. వారు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కష్టపడి పనిచేయడం ద్వారా విజయం సాధించగలరు.
5/6ధనుస్సు రాశి: ఈ త్రిగ్రహి యోగం వలన ధనుస్సు రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు అందుకోబోతున్నారు. గతంలో కంటే వీరి ఆదాయం అధికమవుతోంది. ఫలితంగా, ఈ సమయంలో ధనుస్సు రాశి వారి ఆదాయం అమాంతం పెరుగుతుంది. కొత్త వనరులు, ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయం ఈ రాశి వారి వ్యాపారులకు ప్రత్యేకంగా శుభప్రదంగా ఉండబోతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మీరు పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు. లాటరీ,స్టాక్ మార్కెట్ నుండి లాభాలను ఆర్జించే అవకాశాలు మెండుగా ఉంటాయి.
6/6గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ జ్ఞానం, మూలాల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా కూడా ఉంటుంది. దీనిని జీ న్యూస్ కూడా ధృవీకరించలేదు.