Trikona Rajayoga Effect:కేంద్ర త్రిభుజ రాజయోగం కారణంగా దీపావళికి ముందు.. బృహస్పతి దాని ఉచ్ఛ రాశి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఇది అరుదైన రాజయోగాన్ని క్రియేట్ చేయబోతుంది.
1/7Trikona Rajayoga Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి 11 నెలలకు ఒకసారి బృహస్పతి రాశిని మార్చుకుంటుంది. గురువు బృహస్పతి 2025 ప్రారంభంలో మిథున రాశిలో అరంగేట్రం చేశాడు. త్వరలో 18 అక్టోబర్ 2025న, దేవగురువు మళ్ళీ తన సంచారాన్ని మార్చుకుని కర్కాకంలోకి ప్రవేశింబోతున్నాడు.
2/7కర్కాటం అనేది బృహస్పతి యొక్క ఉచ్ఛ రాశి. దీపావళికి ముందు ఉచ్ఛ రాశిలో బృహస్పతి సంచారము కారణంగా అరుదైన కేంద్ర త్రిభుజ రాజయోగం సృష్టించబడుతుంది.
3/7కర్కాటక రాశిలో బృహస్పతి సంచారము ద్వారా సృష్టించబడే అరుదైన కేంద్ర త్రిభుజ రాజయోగం యొక్క ప్రభావం 12 రాశుల వారిపై కనిపిస్తుంది. అయితే..ఇది మూడు రాశులను వారికి తీవ్ర ప్రభావం చూపనుంది.
4/7మీన రాశి: మీన రాశి వారికి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన దీపావళికి ముందు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుంది. కెరీర్‌లో ఇది స్వర్ణ సమయం కాబట్టి, మీ ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తిస్తారు. పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
5/7మిథున రాశి: మిథున రాశి వారి జీవితంలో కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ కెరీర్ లో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు క్రియేట్ చేయబడుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి స్వర్ణ మయం కాబోతుంది. పెళ్లి కానీ వారికి ఇది శుభయోగం. పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.
6/7కర్కాటక రాశి: కర్కాటక రాశి బృహస్పతి సంచారం కారణంగా ఏర్పడే కేంద్ర త్రికోణ రాజయోగం వలన అద్భుత రాజయోగాన్ని కలిగించబోతుంది. ఈ రాశి వారి జీవితంలోని ఇబ్బందులను అధిగమించబోతుంది. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం బంగారు మయం కాబోతుంది. మీరు అప్పుల నుండి బయటపడతారు. ఇంకా వివాహం కాని వారికి పెళ్లి జరగబోతుంది.
7/7గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, పండితులు, ఇతరుల ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.