Trisha Love With Vijay : తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష. కానీ నాలుగు పదిల వయసు దాటిన ఈ హీరోయిన్ ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచే విషయం. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి త్రిష.. హీరో విజయ్ తో ప్రేమలో ఉంది అన్న వార్త వినిపిస్తూనే ఉంది..
1/5రెండు దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న హీరోయిన్ త్రిష. గతంలో ఈ అమ్మకి బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ అయ్యి ఆ తర్వాత బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.
2/5ఇక అప్పటినుంచి పెళ్లి ఊసు కూడా ఎత్తలేదు ఈ హీరోయిన్. ముఖ్యంగా నాలుగుపదులు వయసు దాటిన ఇంకా కూడా త్రిష పెళ్లి చేసుకోకపోవడం ఆమె అభిమానులను కొద్దిగా నిరాశపరిస్తోంది.
3/5మరోపక్క ఈ హీరోయిన్ హీరో విజయ్ తో ప్రేమలో ఉంది అన్న వార్త తరచు వైరల్ అవుతూనే వస్తుంది. ఎందుకు తగ్గట్టుగానే ఇంటర్వ్యూస్ లో .. త్రిషను మాటిమాటికి విజయ్ గురించి అడుగుతూ ఉంటారు…
4/5ఈ క్రమంలో మొన్న జరిగిన సైమా అవార్డులో త్రిష స్టేజ్ పైకి రాగానే విజయ్ ఫోటో ని స్క్రీన్ పైన వేశారు. ఇక దాంతో అక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా విజయ్ విజయ్ అని అడవసాగారు.
5/5వెంటనే త్రిష విజయ్ గురించి చెబుతూ ఆయన ఏది కలకన్నా అది నెరవేరుతుంది.. ఆయన దేనికైనా అర్హుడే అంటూ చెప్పుకొచ్చింది. మరోపక్క ఆయన ఫోటో చూడగానే ముసి ముసి నవ్వులు నవ్వేసింది త్రిష. ఇక ఆమె నవ్వు చూసే అక్కడున్న వాళ్లంతా త్రిష, విజయ్ మధ్య ఉన్న ప్రేమ రూమర్స్ నిజమే ఏమో అన్న క్లారిటీ తెచ్చుకున్నారు.