Add Zee Business As A Preferred Source
App

Hardik Pandya Rashmika Mandanna: హార్థిక్ పాండ్యాతో రష్మిక మందన్న పెళ్లి.. మీ టాలెంట్‌కు దండం రా బాబు

Published: Apr 22, 2025, 05:19 PM IST|Updated: Apr 22, 2025, 05:19 PM IST

Hardik Pandya Rashmika Mandanna Marriage Pics: బ్రిటిష్ గాయని, టెలివిజన్ నటి జాస్మిన్ వాలియాతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోయిన పాండ్యా.. జాస్మిన్ వాలియాతో ప్రేమాయణం నడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పక్కనపెడితే నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నతో పాండ్యా పెళ్లి అయినట్లు నెట్టింట ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై ఫ్యాక్ట్ చేయగా.. అసలు విషయం తెలిసింది.
 

Hardik Pandya1/7

హార్దిక్ పాండ్యా-రష్మిక మందన్న ఇద్దరు మెడలో దండలు వేసుకున్న ఫొటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు పూల దండలు ధరించి మైదానంలో ఉండగా.. రష్మిక నుదుటిపై బొట్టు పెట్టుకుని ఉంది. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు ఫొటోను క్రియేట్ చేశారు.   

Rashmika Mandanna2/7

hamid786.2011 అనే యూజర్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారని.. మీరు వారిని అభినందించరా..? అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  

Hardik Pandya Rashmika Mandanna Marriage Pics3/7

ఈ ఫొటోలపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా.. ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. హార్దిక్ పాండ్యా, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారని ఎక్కడా కూడా వార్తలు రాయలేదు.  

Hardik Pandya Rashmika Mandanna4/7

పాండ్యా, రష్మిక అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఈ ఫొటోకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. ఏఐ ద్వారా ఈ ఫొటోను క్రియేట్ చేసినట్లు తెలిసిపోయింది. ఈ పిక్ 99 శాతం AI ఉపయోగించినట్లు తేలింది.  

Hardik Pandya Rashmika Mandanna Dating5/7

హార్దిక్-రష్మిక మందన్న మరొక ఫోటో కూడా కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది. దుబాయ్‌లో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు పిక్స్ క్రియేట్ చేశారు. అయితే ఈ ఫొటో కూడా ఫేక్ అని తేలిపోయింది.  

Fact Check of Hardik Pandya rashmika mandanna marriage Pics6/7

Line2One అనే యూజర్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫొటోలను షేర్ చేశారు. "రష్మిక మందన్నతో హార్దిక్ పాండ్యా!" అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటో కూడా AI ఉపయోగించి క్రియేట్ చేసినట్లు స్పష్టమైంది.  

Truth Behind Story of Hardik Pandya rashmika mandanna marriage7/7

చివరగా.. ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి ఫేక్ ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సాంకేతికతను మంచి పనులు ఉపయోగించుకోకుండా ఇలా తప్పుడు ఫేక్ వార్తలు క్రియేట్ చేసేందుకు ఉపయోగిస్తే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది.