Ttd latest news: తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ భారీ శుభవర్త చెప్పింది. దీంతో భక్తులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. సమ్మర్లో దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు భక్తులు ఇప్పటి నుంచి ప్లాన్ లు కూడా వేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంలా కూడా నమ్ముతుంటారు. మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి సైతం భక్తులు భారీగా స్వామివారి దర్శనాలకు వస్తుంటారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
ఈ క్రమంలో ప్రస్తుతం తిరుమలలో.. స్వామివారి దర్శనం కోసం.. తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసుల లెటర్లను భక్తులకు ఇస్తున్నారు. కానీ ఈ రికమండేషన్ లెటర్లను టీటీడీ అధికారులు ఇటీవల పట్టించుకోవడంలేదు.
దీంతో ఇటీవల తెలంగాణకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు సైతం పార్టీల కతీతంగా తిరుమలకు వచ్చే భక్తులకు రాజకీయ నేతలు ఇచ్చే సిఫారసులు లెటర్లను అనుమంతించాలని కోరారు. దీనిపైచర్యలు తీసుకొవాలని ఏపీ చంద్రబాబు సర్కారును కూడా కోరారు.
ఈ నేపథ్యంలో తిరుమల దర్శనం కోసం నేతల సిఫారసుల అంశం సంచలనంగా మారింది. దీనిపై తాజాగా.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ.. తెలంగాణ నేతలు ఇచ్చే సిఫారసుల లెటర్లను అనుమతించనున్నట్లు ప్రకటించింది.
మార్చి 24 నుంచి తెలంగాణ నుంచి బ్రేక్ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాల కోసం .. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆదివారం, సోమవారం , వీఐపీ దర్శనాలు, బుధవారం, గురువారం ప్రత్యేక దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. ఆయా రోజుల్లో ప్రజా ప్రతినిధుల నుంచి ఒక లేఖను మాత్రమే తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.