Add Zee Business As A Preferred Source
App

Tirumala Darshan: రేపు తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ ఆర్జిత సేవలన్ని రద్దు.. కారణం ఏమిటంటే..?

Written ByInamdar Paresh
Published: Oct 28, 2025, 07:27 PM IST|Updated: Oct 28, 2025, 07:32 PM IST

Pushpa yagam in Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ మరోసారి కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఈ కింది విషయాల్ని భక్తులు గమనించాలని కోరింది. రెండు రోజుల పాటు పలు ఆర్జీత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Tirumala:1/6

తిరుమల పుష్పయాగం:

తిరుమలలో శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి మరీ స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకొవడానికి పరితపిస్తుంటారు. ఈ క్రమంలో మొంథా తుపాన్  ప్రభావంతో ప్రస్తుతం తిరుమలలో భక్తులు రద్దీ కాస్తంత తగ్గింది. 

ttd news:2/6

తిరుపతి:

టోకెన్ లు లేనివారికి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నానరు. తిరుమలలో కూడా కుండపోతగా వర్షం కురుస్తుండటంతో టీటీడీ సైతం భక్తులకు కీలక అలర్ట్ ను జారీ చేస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్న వారు మెట్ల మార్గంలో కొండకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది.  

tirumala darshan:3/6

తిరమల దర్శనం:

 మరోవైపు తిరుమలలో శ్రీవారి ఆలయంలో.. అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. దీనిలో భాగంగా..  అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.  

ttd temple:4/6

తిరుపతి:

ఈ క్రమంలో రెండు రోజుల పాటు అంటే అక్టోబర్ 29, 30 వ తేదీల్లో రెండు రోజుల పాటు పలు ఆర్జీత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

tirumala vip darshan:5/6

తిరుమల పుష్పయాగం:

 ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.  

tirumala arjitha sevas:6/6

తిరుమల:

ఈ పుష్పయాగం నేపథ్యంలో.. అక్టోబర్ 29న అంకురార్పణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. అదే విధంగా.. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల‌, అర్చన సేవ‌లు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ మేరకు టీటీడీ భక్తులకు కీలక అలర్ట్ ను మరోసారి జారీ చేసింది.