Tulasi: తులసి మొక్కకు చిన్న పువ్వులు పూశాయా? మీరు ధనవంతులవ్వడం ఖాయం..

Tulasi Plant Remedy: వాస్తు పరంగా ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడం శుభప్రదం అంటారు. అదే విధంగా ప్రతి హిందూ కుటుంబంలోని ఇళ్లలో కచ్చితంగా తులసి మొక్క నాటుకుంటారు. దీనికి పూజలు కూడా చేసుకుంటారు. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే, మీ తులసి మొక్కకు చిన్న చిన్న పువ్వులు వస్తే మీరు ధనవంతులవుతారు.
 

1 /5

తులసి మొక్క ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. లక్ష్మీదేవికి ప్రతీకగా కొలుస్తారు. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటారు. అయితే తులసి మొక్కకు అప్పుడప్పుడు చిన్న చిన్న పువ్వులు కనిపిస్తాయి. అది ఇంట్లో ధన వర్షం కురిపించేలా చేస్తుంది. విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసి మొక్కతో మీరు ఎలా వంతులు అవుతారో తెలుసుకుందాం.  

2 /5

 తులసి మొక్కకు ఇలాంటి చిన్న చిన్న పువ్వులు వచ్చినప్పుడు వాటిని శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది   

3 /5

ఈ పూలను విష్ణువుకి సమర్పించడం వల్ల కూడా శుభప్రదం అంటారు. శ్రీ విష్ణువుకి ఇష్టమైన తులసి ఈ చిన్న పువ్వులతో పాటు సమర్పించటం వల్ల సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో నెగెటివిటీ తొలగిపోతుంది. అంతేకాదు జీవితంలో సక్సెస్ కచ్చితంగా సాధిస్తారు.  

4 /5

 ఇంట్లో గంగా జలంలో కూడా ఈ తులసి చిన్న పువ్వులను కూడా వేసి ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగిపోయి ఆర్థిక లాభాలు కలుగుతాయి.వీటి వల్ల కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది.   

5 /5

 అంతేకాదు తులసి మొక్కకి ఈ చిన్న చిన్న పువ్వులు పూయటానికి తులసి మంజరి అని కూడా పిలుస్తారు. ఎంతో ఇష్టమైనది. ఈ తులసి లేనిదే విష్ణు పూజ అసంపూర్ణమని అంటారు. ఇలా మంజరిని కూడా సమర్పిస్తే ధన వర్షం ఖాయం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)