Crispy Poori: పూరీలు అంటే ప్రతి ఇంట్లో పండుగలకి.. ప్రత్యేక సందర్భాలకి తప్పనిసరి వంటకం. కానీ చాలా మంది నూనె ఎక్కువగా పీలుస్తుందనే.. భయంతో పూరీలు తినడాన్నే మానేస్తారు. కానీ ఇప్పుడు ఒక చిన్న ట్రిక్‌తో మీరు తక్కువ నూనెతో పూరీలు చేయవచ్చు.
పూరి నూనె అస్సలు లాగకూడదు.. అంతే కావలసిన.. ముఖ్యమైన రెండు పదార్థాలు ఏమిటంటే.. ఉప్పు (Salt).. బేకింగ్ సోడా (Baking Soda). ఈ రెండు పదార్థాలు వాడితే నూనె పీల్చే పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల పూరీలు క్రిస్పీగా.. ఫ్లఫీగా.. కానీ గ్రీసీగా.. కాకుండా వస్తాయి.
వేయించే నూనెలో.. కొద్దిగా ఉప్పు వేసినప్పుడు అది ఆహారంలోని తేమను బయటకు తీయడంలో సహాయపడుతుంది. దీని వల్ల పూరీ మీద తేమ త్వరగా ఆవిరైపోతుంది.. దాంతో నూనె లోపలికి ఎక్కువగా చొరబడదు. కొందరు వంటకారులు పూరీ వేయించిన.. తర్వాత కూడా కొద్దిగా ఉప్పు చల్లి అదనపు నూనెను తగ్గిస్తారు.
బేకింగ్ సోడా వేడి నూనెలో లేదా పిండిలో వేస్తే అది కార్బన్ డయాక్సైడ్ వాయువును.. విడుదల చేస్తుంది. దీని వల్ల పూరీ పిండిలో చిన్న బుడగలు ఏర్పడి అవి తేలికగా.. లైట్‌గా తయారవుతాయి. ఈ బుడగలు ఒక రకమైన రక్షణ కవచం వలె పనిచేస్తూ నూనె లోపలికి ఎక్కువగా చేరకుండా అడ్డుకుంటాయి.
ఉప్పు (Sodium Chloride) నూనెతో.. రసాయన చర్య చేయదు.. కానీ ఆహారం మీద ఉన్న తేమను తగ్గించడం ద్వారా నూనె పీల్చడాన్ని తగ్గిస్తుంది. బేకింగ్ సోడా (Sodium Bicarbonate) మాత్రం వేడితో రసాయన మార్పుకు గురవుతుంది..దీని వల్ల పూరీ బయట పొర క్రిస్పీగా మారుతుంది.
పూరీలు తక్కువ నూనెతో..ఆరోగ్యకరంగా చేయాలంటే పిండిలో కొంచెం ఉప్పు..వేయించే నూనెలో కొద్దిగా ఉప్పు లేదా బేకింగ్ సోడా వేయండి. దీని వల్ల పూరీలు తక్కువ నూనెతో కూడా రుచిగా..కరకరలాడేలా వస్తాయి.