Add Zee Business As A Preferred Source
App

Two Days Holidays: రెండు రోజులు సెలవులు.. నేటి బడ్జెట్‌లో ప్రకటన..?

Written ByRenuka Godugu
Published: Feb 01, 2025, 06:09 AM IST|Updated: Feb 01, 2025, 06:09 AM IST

Two Days Bank Holidays in Budget 2025-26: బ్యాంకు ఉద్యోగులు ఎన్నో రోజులుగా డిమాండ్‌ చేస్తున్న రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు అమలుపై నేడు 2025-26 బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలు అయితే, ఇక బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఇక బ్యాంకు పనివేళల్లో కూడా మార్పులు ఉంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

Bank Holidays1/5

బ్యాంకులకు సెలవు

బ్యాంకులో డిపాజిట్లు, విత్‌డ్రా ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తాం. ప్రతి ఆదివారంతోపాటు రెండు, నాలుగో శనివారాల్లో ఈ బ్యాంకులు పనిచేయవు. అయితే, ఎన్నో రోజులుగా ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ బ్యాంకులకు 5 రోజులు పనిదినాలుగా మార్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  

Budget2/5

బడ్జెట్‌

ఈనేపథ్యంలో నేటి 2025-26 బడ్జెట్‌లో దీనిపై ఓ నిర్ణయం రానుందని బ్యాంకు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇదే జరిగితే బ్యాంకులు కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగులు, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ దీనిపై పలుమార్లు సమావేశం నిర్వహించారు.  

Central GOVT3/5

కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఆర్‌బీఐ నిర్ణయం కూడా ఈ ఐదు రోజుల పనిదినాల అమలుకు తప్పనిసరి. కేంద్రం, ఆర్‌బీఐ ఆమోదం చెబితే ఇక బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయి. అంతేకాదు వాటి పని సమయం కూడా పెరుగుతుంది.  

Bank4/5

బ్యాంకు

ఇక బ్యాంకుల పని వేళలు 40 నిమిషాలు పెరుగుతాయి.  అయితే, బ్యాంకులు బంద్‌ ఉన్నా కానీ, కొన్ని ఆర్థిక లావాదేవీలు మనం నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా నిర్వహించుకోవచ్చు.  డబ్బులు ఏటీఎం ద్వారా కూడా విత్‌ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవు ఆమోదం తెలిపితే బ్యాంకు కస్టమర్లకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.  

February5/5

ఫిబ్రవరి

ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు రానున్నాయి. ఈ సెలవులు ఆర్‌బీఐ లేదా స్థానిక ప్రత్యేక దినాలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి నెలలో రెండో, నాలుగో శనివారంతోపాటు ఆదివారాలు, మహా శివరాత్రి మరికొన్ని ప్రత్యేక దినాల నేపథ్యంలో బ్యాంకులు మొత్తంగా 14 రోజులు పనిచేయవు.