Add Zee Business As A Preferred Source
App

Single Heroines: 40 ఏళ్లు దాటిన హీరోయిన్లు.. ఆంటీ వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు వీరే!

Published: Sep 29, 2025, 04:37 PM IST|Updated: Sep 29, 2025, 04:37 PM IST

These Heroines Not Get Married Even Age Crossed 40 Years Here List: సినీ పరిశ్రమలో నటీనటులు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి సారిస్తారు. ఈ క్రమంలోనే జీవితంలోనే ముఖ్యమైన ఘట్టం వివాహం. ఈ సినిమాల్లో మునిగి కొందరు హీరోయిన్లు ఇంకా పెళ్లి చేసుకోలేదు. 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా చేసుకోలేదు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

1/7

సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు వివాహ వయస్సు దాటిపోయినా కూడా వివాహం చేసుకోలేదు. వారిలో టాప్‌ హీరోయిన్లు ఉండడం విశేషం. కొందరు ఇంకా సినీ పరిశ్రమలో ఉండగా.. మరికొందరు వివిధ రంగాల్లో బిజీగా ఉన్నారు. మరి పెళ్లి చేసుకోని హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

2/7

నటి, భరతనాట్య కళాకారిణి శోభన ఇంకా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు. తెలుగు, కన్నడ, తమిళం సహా అనేక భాషల్లో నటించింది. భరతనాట్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన శోభన వివాహంపై ఆసక్తి లేదు. దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు.

3/7

సినీ నటి సితారకు 52 సంవత్సరాలు వచ్చాయి. అయినా కూడా ఆమె అవివాహితగా మిగిలిపోయారు. తెలుగు, తమిళ సినిమాల్లో ఆమె మెరిశారు.

4/7

రవితేజ, శ్రీకాంత్‌తో నటించిన హీరోయిన్ కౌసల్య కూడా వివాహం చేసుకోలేదు. ఆమె వయస్సు 47 ఏళ్లు వచ్చినా కారణం తెలియదు కానీ వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఆమె తమిళనాడులో నివసిస్తున్నారు.

5/7

అగ్ర హీరోలందరితోనూ నటించిన స్టార్‌ హీరోయిన్‌ త్రిష వివాహం వివాహం చేసుకోలేదు. ఆమెకు ఇప్పుడు 42 సంవత్సరాలు. వివాహంపై ఆసక్తి లేదని తెలుస్తోంది.

6/7

బాహుబలితో పాన్‌ వరల్డ్‌ హీరోయిన్‌గా అనుష్క శెట్టి మారారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అనుష్క వివాహం చేసుకోలేదు. 43 ఏళ్లు వచ్చినా కూడా అనుష్క వివాహంపై దృష్టి సారించలేదు. ఆమె అభిమానులు పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

7/7

సినీ నటి నగ్మా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్నారు. గతంలో ఓ క్రికెటర్‌తో ప్రేమలో పడ్డారని తెలిసినా కూడా వివాహం చేసుఓలేదు.  ఆమెకు ప్రస్తుతం 50 సంవత్సరాలు వచ్చాయి. ఇక వివాహం చేసుకోదని స్పష్టమవుతోంది.