Add Zee Business As A Preferred Source
App

Under Rs 5 Lakhs Cars: ఈ కార్లు చీప్‌ అండ్‌ బెస్ట్‌..రూ. 5లక్షలకే పొట్టి కార్లు.. పెట్రోల్ గురించి మర్చిపోయేంత మైలేజీతో..!!

Written ByBhoomi
Published: Sep 17, 2025, 03:04 PM IST|Updated: Sep 17, 2025, 03:04 PM IST

Cars under 5 lakhs: కారు కొనాలనుకునే వారికి బడ్జెట్ ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ప్రత్యేకంగా మొదటిసారి కారు కొనుగోలు చేయబోయే వారికి తక్కువ ధరలో మంచి ఫీచర్లు, మైలేజ్ అందించే మోడల్స్ కు కోసం సెర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం... రూ. 5 లక్షల లోపు కూడా మంచి పనితీరు, ఆకర్షణీయమైన లుక్, సరైన మైలేజ్ ఇచ్చే కార్లు మార్కెట్లో ఉన్నాయి. ముఖ్యంగా రోజువారీ నగర ప్రయాణాలకు ఇవి సరైన ఎంపిక కావచ్చు. ఆ కార్లు ఏవో చూద్దాం. 

Maruti Alto K10 price1/5

మారుతి ఆల్టో K10:

మారుతి ఆల్టో K10: మొదటిసారి కారు కొనాలనుకునేవారికి ఆల్టో K10 మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. చిన్న కుటుంబానికి సరిపడే ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. లీటరుకు 24.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం దీని ప్రధాన బలం. ధరలు రూ. 4.20 లక్షల నుంచి రూ. 6.20 లక్షల వరకు ఉన్నాయి.  

Tata Tiago2/5

టాటా టియాగో

టాటా టియాగో భద్రత విషయంలో టియాగో అగ్రగామిగా నిలుస్తుంది. గ్లోబల్ NCAP నుండి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కారు.. పెట్రోల్  CNG వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 19-20 kmpl, CNG వేరియంట్ 26-28 kmpl మైలేజ్ ఇస్తుంది. ధరలు రూ. 4.99 లక్షల నుండి రూ. 7.40 లక్షల వరకు ఉన్నాయి.  

Renault Kwid3/5

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ SUV తరహా లుక్ కావాలనుకునే వారికి క్విడ్ సరైన ఎంపిక. 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వలన కఠినమైన రోడ్లపై కూడా సులభంగా నడుస్తుంది. మైలేజ్ 21.7-22 kmpl వరకు ఇస్తుంది. ధరలు రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షల వరకు ఉంటాయి. స్టైలిష్ లుక్, యూత్‌ఫుల్ డిజైన్‌తో యువతలో ఈ కారు హిట్ అయింది.

Maruti S-Presso4/5

మారుతి ఎస్-ప్రెస్సో

మారుతి ఎస్-ప్రెస్సో చిన్న SUV స్టైల్ డిజైన్ కావాలనుకునేవారికి ఎస్-ప్రెస్సో ఒక మంచి ఆప్షన్. ఇది ఆల్టో K10లో వాడే 1.0 లీటర్ ఇంజిన్‌తోనే వస్తుంది. లీటరుకు 24 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.12 లక్షల వరకు ఉంది. తక్కువ ధరలో SUV లుక్ ఇవ్వడం దీని ప్రధాన ఆకర్షణ.  

Under Rs 5 Lakhs Cars5/5

తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్

తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, సరైన పనితీరు, ఫ్యామిలీ యూజ్ కోసం ఈ కార్లు అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఎక్కువ ఫీచర్లు లేకపోయినా, సరసమైన ధరలో నమ్మకమైన సౌకర్యాన్ని ఇవి అందిస్తాయి. మొదటిసారి కారు కొనేవారికి ఇవి నిజంగా  వాల్యూ ఫర్ మనీ  మోడల్స్ ఇవే.