Madhya Pradesh news: మధ్య ప్రదేశ్ లోని ఆదిమ తెగ ఇప్పటికి వింతైన ఆచారంను పాటిస్తారు. పెళ్లిలో వధువుతో పాటు.. 21 విషసర్పాలను కూడా అల్లుడికి కట్నంగా ఇస్తారు. ఈ సంప్రదాయంను ఇప్పటికి కూడా వాళ్లు పాటిస్తారంట.
టెక్నాలజీ రోజురోజుకు ఎంతో డెవలప్ అవుతుంది. ఏకంగా మనిషి చంద్రమండలం మీద భూముల్ని కొనేసే స్థితికి చేరుకున్నాడు. అయిన కూడా ఇప్పటికి పలు చోట్ల కొన్ని సంఘటనలు చూస్తుంటే మాత్రంచాలా ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి.
సాధారణంగా పెళ్లి సంప్రదాయం అనేది ఒక్కొ కులం, మతంలో భిన్నంగా ఉంటుంది. కొన్ని సార్లు ఈ పెళ్లి పద్దతులు చూస్తే మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉంటాయి. అయితే.. కొన్ని చోట్ల ఇల్లరికం అల్లుడు వెళ్లడం కొన్ని తెగల్లో సంప్రదాయంగా పాటిస్తారు.
మరికొన్ని తెగల్లో పెళ్లిలో చిత్ర విచిత్రమైన పద్ధతులను ఫాలో అవుతుంటారు.అయితే.. ప్రస్తుతం .. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గౌరియా అనే ఒక ప్రత్యేక సామాజిక వర్గం పెళ్లిలో పాటించే భిన్న సంప్రదాయం వార్తలలో నిలిచింది. గౌరియా తెగ ముఖ్యంగా అడవుల్లో పాముల్ని పట్టుకుని తమ జీవనం సాగిస్తారు. వారు ముఖ్యంగా.. తమ ఇంట్లోని ఆడబిడ్డలకు పెళ్లి సెటిల్ అయ్యిందనగానే వెంటనే పాముల్ని పట్డడం ప్రారంభిస్తారంట.
మొత్తంగా 21 విషపూరితమైన పాముల్ని పట్టుకుని మరీ వాటిని అమ్మాయితో పాటు.. వరుడికి కట్నం కింద ఇచ్చి అత్తారింటికి పంపిస్తారంట. దీని వల్ల అత్తారింట్లోకి వెళ్లిన అమ్మాయికి అంతా మంచి జరుగుతుందంట. ఏవైన వాస్తు దోషాలు, పెళ్లిలో దోషాలు ఉంటే.. దీని వల్ల పోతాయని వాళ్లు అనాదీగా ఈ ఆచారంను పాటిస్తాన్నారంట.
ఇక పోరపాటున ఆ పాముల్లో ఏదైన పాములు చనిపోతే.. వెంటనేమనుషుల్లో మాదిరిగా పాములు అంత్యక్రియలు జరిపించి మరీ.. దాని యజమాని గుండు కోట్టించుకొనే పద్దతిని పాటిస్తారంట. ఇలా చేస్తే పాము చనిపోయిన దోషం చుట్టుకొదంట.
అదే విధంగా పాముల్ని కూతురుతో పాటు పంపించకుంటే మాత్రం జరగరానిది జరిగి.. అశుభం సంభవించే అవకాశం పుష్కలంగా ఉంటుందని కూడా ఆ తెగ వారు నమ్ముతారంట. మొత్తంగా మధ్య ప్రదేశ్ లోని గరియా తెగ వారి విచిత్ర సంప్రదాయం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.