Add Zee Business As A Preferred Source
App

Upasana: బతుకమ్మ ఆడిన ఉపాసన.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో ఆడిపాడిన ఫోటోస్‌ వైరల్‌..

Written ByRenuka Godugu
Published: Sep 28, 2025, 07:23 AM IST|Updated: Sep 28, 2025, 07:23 AM IST

Upasana Bathukamma With Delhi CM: బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేకం బతుకమ్మ వేడుకలు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం జరుపుతున్నారు.  వారంతా ఆడి పాడుతున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం రేఖాగుప్తాతో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కూడా బతుకమ్మ ఆడారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

Delhi CM1/5

 ఢిల్లీ సీఎం

 ఢిల్లీ సీఎం రేఖ గుప్తాతో కలిసి హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడారు. ఢిల్లీలోని ఓ కాలేజీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేఖ గుప్తాతో పాటు ఉపాసన కొణిదెల కూడా హాజరయ్యారు  

Social Media2/5

సోషల్ మీడియా

 అక్కడ ఇద్దరు బతుకమ్మని ఎత్తుకొని పాటలు పాడుతూ.. సరదాగా ఆడి పాడారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది పూల ఉత్సవం మాత్రమే కాదని మాతృత్వం, జీవనం, ప్రకృతికి ప్రతీక అని ఢిల్లీ సీఎం రేఖ గుప్తా కూడా ట్వీట్‌ చేశారు  

Upasana3/5

ఉపాసన

 ఇక తెలంగాణ కల్చర్‌ను గౌరవిస్తూ తమతో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఉపాసన కొణిదెల కూడా రీట్వీట్‌ చేశారు. గత ఆదివారం నుంచి బతుకమ్మ ప్రారంభం అయింది. ఈ నెల 30వ తేదీన బతుకమ్మ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

Telangana4/5

తెలంగాణ ప్రభుత్వం

 ఈనెల 30 మంగళవారం బతుకమ్మ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వేడుకలు నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.  

Bathukamma5/5

బతుకమ్మ

 అయితే బతుకమ్మ సందర్భంగా తెలంగాణలో ఇప్పటికే ఆ రోజున పబ్లిక్ హాలిడేగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బతుకమ్మ ఏ రోజు జరుపుకోవాలన్న సందిగ్ధం చాలామందిలో ఉంది. కొన్ని చోట్ల సోమవారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు తాజాగా ప్రభుత్వం మంగళవారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.