Upasana Konidela Burns KGs of Weight And Get Tremendous Weight Loss Journey: సినీ పరిశ్రమలో గొప్పింటి కోడలుగా ఉన్న ఉపాసన కొణిదెల ఆరోగ్య రహాస్యం తెలిసింది. ఆమె నిత్యం యవ్వనంగా.. ఉత్సాహంగా ఉండడమే కాకుండా బరువు పెరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం. ఒక్క పదార్థంతో ఉప్సీ బరువు తగ్గుదల పొందుతున్నారు. అదేమిటో తెలుసుకుందాం.
సమాజంలో అందరికీ ఆరోగ్యంపై స్పృహ పెరుగుతోంది. దీంతో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. ఆహార సమతుల్యత పాటించడంతో దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెల ఆరోగ్య రహాస్యం ఏమిటో తెలుసుకుందాం.
ఆరోగ్యం కోసం పోషకాహారానికి ఉపాసన ప్రాధాన్యం ఇస్తున్నారు. గొప్ప వైద్య కుటుంబం.. వైద్య వ్యాపారం నుంచి ఉన్నా కూడా ఉపాసన ఇంటి చిట్కాలు.. సొంతంగా డైట్ పాటిస్తున్నారు. తన ఆహారంలో ఉపాసన తప్పనిసరిగా చిరుధాన్యాలను భాగం చేసుకున్నారు. ముఖ్యంగా రాగులను తీసుకుంటున్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుండడంతో రోజువారీ ఆహారంలో ఆమె భాగం చేసుకున్నారు.
రామ్‌చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన చిరుధాన్యాల్లో తనకు రాగులు బాగా ఇష్టమని తెలిపారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ సలహా మేరకు రాగులను ఏదో ఒక రూపంలో రాగులు ఉండేలా చూసుకుంటున్నట్లు 36 ఏళ్ల ఉపాసన చెప్పారు. రోజు ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే తీసుకుంటున్నట్లు వివరించారు.
రాగి గంజిని తాను తాగుతున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. తనను ఇంతలా ఫిట్‌గా ఆకర్షణీయంగా కనిపించేలా రాగులు చేస్తున్నాయని ఉపాసన తెలిపారు. ఇది తన కుమార్తెకు కూడా ఇస్తున్నానని ఉపాసన వెల్లడించారు. అయితే ఉప్సీ గారాలపట్టీకి నచ్చిందా? అని అడగ్గా 'ఇక తప్పదు' అని పేర్కొన్నారు.
ఒక్క ఉపాసన మాత్రమే కాదు సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకుంటున్నారు. ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకుని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. రాగుల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
హీరో రామ్ చరణ్‌తో వివాహం తర్వాత ప్రజలకు తెలిసిన ఉపాసన గొప్పింటి ఆడబిడ్డ. మెగా ఇంటి కోడలిగా చక్కగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన అంతేకాకుండా అనేక వ్యాపారాలు చూసుకుంటున్నారు. అపోలో ఆస్పత్రులు, రామ్ చరణ్‌కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఉప్సీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.