Add Zee Business As A Preferred Source
App

UPI Big Update: అలర్ట్.. అలర్ట్.. యూపీఐ యూజర్స్‌కు సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్స్.. ఇవి తెలుసుకున్నాకే డిజిటల్ చెల్లింపులు చేయండి..!

Written ByAruna Maharaju
Published: Sep 15, 2025, 06:19 PM IST|Updated: Sep 15, 2025, 06:52 PM IST

UPI New Rules: ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులు చేయని వారు అంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. అయితే యూపీఐ ద్వారా పెద్ద మొత్తాలు చెల్లించాలనుకునే వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక మంచి వార్త చెప్పింది. లావాదేవీల పరిమితి వల్ల సమస్యలు ఎదుర్కొనే వారికి ఊరట కల్పిస్తూ, కొన్ని ముఖ్యమైన రంగాల్లో రోజువారీ చెల్లింపుల పరిమితిని 10 లక్షల రూపాయల వరకు పెంచింది. ఈ కొత్త నియమాలు సెప్టెంబర్ 15, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.
 

Upi New Transaction Limits1/5

యూపీఐ యూజర్స్‌కు సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్స్

ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసేవారికి బిగ్ అప్‌డేట్. సెప్టెంబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐ లావాదేవీలకు కొత్త నియమాలను అమల్లోకి తెచ్చింది. ఈ మార్పులతో డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా, వేగంగా జరగనున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి సామాన్య వినియోగదారుల వరకు అందరికీ ఈ కొత్త నియమాలు ఉపయోగపడతాయి.   

Upi New Transaction Limits2/5

యూపీఐ యూజర్స్

వ్యక్తుల మధ్య చెల్లింపులకు రోజుకు లక్ష రూపాయల పరిమితి ఇప్పటికీ అలాగే ఉంది. కానీ కొన్ని ప్రత్యేక రంగాల్లో పెద్ద మొత్తాల చెల్లింపులకు కొత్త నిబంధనలు వచ్చాయి. ఉదాహరణకు షేర్ మార్కెట్ పెట్టుబడులు, బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లులు, ఈవీఎం చెల్లింపుల కోసం ఒకే లావాదేవీలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు చెల్లించవచ్చు. 

Upi New Rules 3/5

సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్స్

ట్రావెల్ బుకింగ్‌లు, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్ల కోసం కూడా ఇదే పరిమితి వర్తిస్తుంది. ప్రభుత్వ ఈ-మార్కెట్‌లో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు చెల్లింపులు చేయొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లుల కోసం 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఒకేసారి క్లియర్ చేయవచ్చు. 

Upi New Rules 4/5

యూపీఐ చెల్లింపులు చేసేవారికి బిగ్ అప్‌డేట్

ఆభరణాల కొనుగోలుకు 2 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు చెల్లించొచ్చు. వ్యాపార లావాదేవీలు లేదా వ్యాపారులకు చెల్లింపుల కోసం ఒకే లావాదేవీలో 5 లక్షల రూపాయల వరకు చెల్లించవచ్చు, ఇందులో రోజువారీ పరిమితి లేదు. 

Upi New Rules 5/5

యూపీఐ పేమెంట్స్

ఎఫ్‌ఎక్స్ రిటైల్ చెల్లింపులకు 5 లక్షల రూపాయలు, టర్మ్ డిపాజిట్ల కోసం డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్‌కు 5 లక్షల రూపాయలు, డిజిటల్ అకౌంట్ ఇనీషియల్ ఫండింగ్‌కు రోజుకు 2 లక్షల రూపాయల పరిమితి ఉంది. డిజిటల్ చెల్లింపుల వాడకం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త నియమాలు డిజిటల్ ఇండియాను మరింత బలంగా చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.