Utpanna Ekadashi 2025: కార్తీక మాసంలో శక్తివంతమైన ఉత్పన్న ఏకాదశి.. రేపు తప్పకుండా ఏంచేయాలంటే..?

Utpanna Ekadashi in Karthika masam: కార్తీక మాసంలో శివకేశవుల్ని భక్తితో పూజించుకుంటారు.ఈ క్రమంలో ఉత్పన్న ఏకాదశి రోజున చేసే పూజలు, వ్రతాలు గొప్ప ఫలాతాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు.
 

1 /6

జ్యోతిష్య పండితులు కార్తీక మాసంను ఎంతో గొప్పదని చెబుతారు.ఈ నెలంతా శివ,కేశవుల అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు వెయ్యిరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంటారు. 

2 /6

ఇప్పటికే కార్తీకమాసం నేపథ్యంలో అందరు కూడా ప్రతి ఒక్కగుళ్లకు క్యూలు కడుతున్నారు.మరికొంత మంది  గంగానదీ స్నానాలు, వనభోజనాలకు వెళ్తున్నారు. మొత్తంగా కార్తీకంలో దీపదానం, తులసీ వివాహంను ఎంతో గొప్పదిగా చెబుతారు.  

3 /6

ఈ క్రమంలో మనం ఉత్పన్న ఏకాదశిని మనం ఈసారి నవంబర్ 15న శనివారం రోజున జరుపుకోబోతున్నాం. అయితే.. శ్రీమహా విష్ణువు ఒకసారి యోగ నిద్రలో ఉండగా మురాసురుడు అనే దానవుడు దాడికి యత్నిస్తాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు శరీరం నుంచి ఒక దేవకన్య బైటకు వచ్చి అతడితో యుద్దం చేసి హతమార్చింది.  

4 /6

 అప్పుడు శ్రీ మహా విష్ణువు నుంచి ఉత్పన్న మైందని కాబట్టి ఆ దేవ కన్యకు అప్పటి నుంచి ఉత్పన్న ఏకాదశిగా పిలుస్తారు. తాను శ్రీ మహా విష్ణువుకు చేసిన సాయంకు గుర్తుగా దేవకన్యకు విష్ణువు వరమిచ్చాడు.  ప్రతినెలలో రెండు మార్లు ఏకాదశిని వివిధపేర్లతో అప్పటి నుంచి పండగలా జరుపుకుంటు వస్తున్నాం.  

5 /6

అందుకే అనేక తిథులున్న కూడా శ్రీ మహా విష్ణువుకు ఏకాదశిని అత్యంత ప్రీతికరమైందని చెబుతారు. మనం నవంబర్ 15 శనివారంరోజున ఉత్పన్న ఏకాదశిని జరుపుకుంటున్నాం. ఈరోజున శ్రీమహా విష్ణువును తులసీ దళాలు, తెల్లని పూవులతో పూజించుకోవాలి.  

6 /6

ఈ రోజునచేసే పూజలు, వ్రతాలు గొప్పఫలితాలు ఇస్తాయంటారు. ముఖ్యంగా విష్ణువు ఆలయంలోకి వెళ్లి రావి చెట్టు కింద దీపారాధన చేయాలి, పండితులకు నవధాన్యాల దానం ఇవ్వాలి. పేదలకు అన్నదానం, నల్ల చీమలకు చక్కెర లేదా బెల్లంను ఇవ్వాలి. శునకాలకు చపాతీలు , ఆవులకు పశుగ్రాసం పెట్టాలి. ఇలా చేస్తే తెలిసి,తెలియక చేసుకున్న దోషాలు పోతాయని పండితులు చెబుతుంటారు.