Vahanamitra Status Check: వాహన మిత్ర స్కీమ్ కింద ఆటో డ్రైవర్లకు రూ.15,000 జమ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లకు కూడా వర్తిస్తుంది. ఈ నెల నాలుగో తేదీన వారి ఖాతాలో నేరుగా జమ చేయనుంది. అయితే అర్హులు తమ ఆధార్ కార్డుతో నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ కూడా చెక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
1/5ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో ,క్యాబ్ డ్రైవర్ల కోసం వారి ఖాతాల్లో రూ.15 వేల జమ చేయనుంది. ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర స్కీం కింద ఈ డబ్బు జమ చేయనుంది. అయితే అర్హులైన వారు తమ ఆధార్ కార్డు నెంబర్‌తో స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది.
2/5ముందుగా ఎన్‌బీఎం సైట్ ఓపెన్ చేసి అందులో అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. అందులో ఆటో డ్రైవర్ సేవలో అని సెలెక్ట్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఈ పథకానికి మీరు అర్హులా? కాదా? కూడా తెలిసిపోతుంది.
3/5ఆటో, క్యాబ్ డ్రైవర్‌లు ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం సంబంధించి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్‌ల ఖాతాల్లో రూ.15000 ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. గత నెల 17వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టి తుది జాబితా తయారు చేసింది.
4/5ఇక దరఖాస్తుదారుడైన వివరాలను ఎంటర్ చేస్తే సులభంగా స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. దీనికి ఆధార్ నెంబర్, క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఓటీపీ నమోదు చేయాలి. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ స్టేటస్ తెలిసిపోతుంది.
5/5ఏపీ ప్రభుత్వం ఇదొక సామాజిక సంక్షేమ పథకంగా ఆటో, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రారంభించింది. ఏడాది ప్రతి ఏడాది రూ.15000 వారికి జమ చేయనుంది. దీనికి కొన్ని అర్హతలు ఉంటాయి. వాటిని చెక్ చేసుకుని సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.