Vaishakh Purnima Effect: వైశాఖ మాసంలోని పౌర్ణమి అత్యంత శక్తివంతమైందని చెబుతుంటారు.ఈ సమయంలో మనం ఎలాంటి పూజలు, వ్రతాలు చేసిన అది వెయ్యి రెట్లు గొప్పఫలితాలను ఇస్తుందంట. ఈసారి పౌర్ణమి సోమవారం రావడం ఎంతో గొప్పదని శివుడ్ని ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు.
వైశాఖ మాసంలో మనం ఈసారి పౌర్ణమిని సోమవారం మే 12న జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు శుక్రుడు, గురుడు ఒకే సరళ రేఖ మీదకువస్తున్నారు. దేవతల గురువు, దానవుల గురువు ఒకేచోటకు రావడం వల్ల.. ద్వాదశ రాశులపై గొప్ప ఫలితాలు కల్గుతాయి.
కొన్ని రాశులకు గొప్ప ఫలితాలు కల్గుతుండగా.. మరికొన్ని రాశులకు మధ్యస్తఫలితాలు కల్గుతాయి. ఈ క్రమంలో వైశాఖ పౌర్ణమి వేళ కొన్ని నియమాల్ని కూడా పాటించాలని పండితులు చెబుతున్నారు.
సింహా రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలొ రాణిస్తారు. మీ జీవితంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విందులు , వినోదాల్లొ పాల్గొంటారు. విదేశీయానంకు చాన్స్ ఉంది.
తుల రాశివారికి అనుకొని విధంగా లాటరీ తగులుతుంది. కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు . భార్యతరపు నుంచి డబ్బులు వస్తాయి. మీరు ఉన్నత పదవుల్ని అధిరొహిస్తారు.
కర్కాటక రాశివారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెళ్లికి ఇప్పటివరకు ఏర్పడిన ఆటంకాలు అన్నిదూరమౌతాయి. మీ వల్ల ఇంటి వాళ్లకు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.