Vastu Tips: మీ ఇంటి ఈ దిశలో కలబంద మొక్క ఉంటే ఎప్పటికీ లక్ష్మీ కటాక్షమే.. ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక లోటే ఉండదు..

Aloevera Plant Vastu Tips: తులసి చెట్టు ప్రతిఒక్కరి ఇళ్లలో ఉంటుంది. హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. అదేవిధంగా కలబంద చెట్టుకు కూడా అలాంటి ప్రాధాన్యత ఇస్తారు. కలబంద మొక్కలు ఔషధ గుణాలు ఉంటే అయితే వాస్తు పరంగా కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
 

1 /5

కలబంద ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు మెండు. అందుకే వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటారు. సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. అయితే వాస్తు పరంగా కలబంద మొక్క ఇంటికి ఈ దిశలో ఉంటే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.  

2 /5

వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్క పెట్టుకుంటే పాజిటివిటీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. వారింట ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే నమ్మకం ఉంది.  

3 /5

కలబంద ఎప్పటికీ ఇంటికి తూర్పు దిశలో పెట్టుకోవడం ముఖ్యం. ఈ దిశాలలో ఉండటం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పు దిశలో లేకుంటే ఉత్తర దిశలో కూడా పెట్టుకోవచ్చు.  

4 /5

కలబంద ఈ సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆదాయం పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. అయితే పొరపాటున కలబంద మొక్కను వాయువ్య దిశలో నాటకూడదు.  

5 /5

చాలామంది ఇళ్లలో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను పెంచుకుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి. కలబంద మొక్క ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇది ఇండోర్ ప్లాంట్ కూడా ఎక్కువ నిర్వహణ అవసరం లేని మొక్క.