Veg Omelette Recipe: మీరు అస్సలు నాన్ వెజ్ తినరా.. లేదు అంటే వారంలో కొద్ది రోజులు మాత్రమే నాన్ వెజ్ తినకుండా ఉంటారా. ఈ రెండు రకాల్లో మీరు ఏ రకంగా చెందిన వాళ్లయినా సరే.. ఈ వెజిటేరియన్ ఆమ్లెట్ ట్రై చేయండి.. ఎంతో రుచికరంగా.. ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది.
1/5మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే.. ఈ ప్యూర్ వెజ్ ఆమ్లెట్ ట్రై చేయండి.. అన్నంలో నంచుకోవడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.
2/5శనగపిండి: ఒక కప్పు తరిగిన ఎర్రగడ్డ ఒకటి, చిన్నగా తరుగుకున్న రెండు పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరప్పొడి
3/5ముందుగా సెనగపిండిలో నీళ్లు పోసుకుంటూ.. గడ్డ కట్టకుండా కోరి గుడ్డు మిశ్రమం లాగా కలుపుకుంటూ ఉండాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి మరోసారి కలపాలి.
4/5ఇక పాన్లో నూనె పోసుకుని.. ఆనియన్స్ బాగా వేయించుకొని.. ఆ ఆనియన్స్ ని.. శనగపిండి మిశ్రమంలో కలుపుకోవాలి.
5/5ఇక అందులోనే తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్ పైన నూనె పోసి దానిపైన ఆమ్లెట్ లాగా వేయాలి. చివరిగా పైన మిరప్పొడి చల్లుకొని తింటే.. ఎంతో రుచికరమైన వెజిటేరియన్ ఆమ్లెట్ సిద్ధం.