Add Zee Business As A Preferred Source
App

Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి దర్శనాలు బంద్.. ఎందుకంటే..?

Published: Oct 20, 2025, 03:49 PM IST|Updated: Oct 20, 2025, 03:49 PM IST

Vemulawada Temple Close: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో.. రేపటి నుండి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నిత్యం కేవలం కైంకర్యపూజలు మాత్రమే ఉంటాయి. స్వామి వారి దర్శనాన్ని ఇక నుంచి ఎల్‌ఈడీ స్క్రీన్‌లలోనే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
 

Vemulawada Temple Close1/5

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి దర్శించుకున్నారు. స్వయంగా స్వామివారికి అభిషేకం, హారతి సమర్పించారు.   

Vemulawada Temple Close2/5

వేములవాడ

అనంతరం ఆలయమంతా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. శృంగేరి పిఠాధిపతి రాకతో భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఇక రేపటి నుంచి ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనం బంద్ అవుతుంది. 

Vemulawada Temple Close3/5

వేములవాడలో రేపటి నుంచి దర్శనాలు బంద్

రేపటి నుంచి నిత్యం కేవలం కైంకర్యపూజలు మాత్రమే ఉంటాయి. స్వామి వారి దర్శనాన్ని ఇక నుంచి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.   

Vemulawada Temple Close4/5

వేములవాడలో రేపటి నుంచి దర్శనాలు బంద్

రాజన్న ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అర్చకులు, వేదపండితుల సూచనలు తీసుకున్నారు. భక్తుల కోసం ఎల్‌ఈడీ స్క్రీ‌న్‌లు ఏర్పాటు చేశారు. 

Vemulawada Temple Close5/5

వేములవాడలో రేపటి నుంచి దర్శనాలు బంద్

అయితే శ్రీ రాజరాజేశ్వరస్వామి మూలవిరాట్టు దర్శనం నిలిపివేయడంతో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో మూలవిరాట్టు దర్శనాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా కల్పిస్తామని ఇటీవలే దేవాదాయశాఖ ప్రకటన చేసింది.