Venkatesh Wife Neeraja: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

Fri, 13 Dec 2024-11:55 am,

Venkatesh Neeraja Reddy Family Ground : వెంకటేష్ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేసి మాస్ అండ్ క్లాస్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే హీరోగా 38 యేళ్లుగా అలరిస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా మాస్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఫ్యామిలీ హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు చేస్తోన్న మధ్యమధ్యలో మాస్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం వెంకటేష్ కు చెల్లింది.

సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా అలరిస్తూన్న ఆయన గురించి ఒక్క గాసిప్ కూడా బయటకు రాలేదు. పైగా ఈయన కుటుంబ సభ్యుల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఆయన భార్య నీరజాతో పాటు ముగ్గురు పిల్లల గురించి గూగుల్ లో వెతికినా.. దొరకదు. అంతలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తూ ఉంటారు వెంకటేష్.

ఇక వెంకటేష్ తన భార్యతో కలిసి ఎక్కడా బయట కనిపించినా దాఖలాలు లేవు. అయితే ఆయన భార్య నీరజా రెడ్డి తల్లిదండ్రులది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె. తండ్రి వెంకట సుబ్బారెడ్డి, తల్లి ఉషారాణి. వీరిది జమీందారి కుటుంబం. అంతేకాదు ఆ ఏరియాలో వీరికి సంబంధించిన భూములతో పాటు టెక్స్ టైల్ మిల్స్,  ఫ్యాక్టరీలతో పాటు పెద్ద బిజినెస్ నెట్ వర్క్ ఉంది.

ఇక అప్పట్లో హీరోగా వెంకటేష్ స్థిర పడటంతో పెళ్లి చేయాలని రామానాయుడు ఫిక్స్ అయ్యారు. దీంతో తన సహా నిర్మాత అయిన విజయా సంస్థ అధినేత అయిన నాగిరెడ్డికి పెళ్లి సంబంధం చూడమని చెప్పడంతో తన ఏరియాకు సంబంధించిన నీరజా రెడ్డి ఫ్యామిలి గురించి రామానాయడుకు చెప్పారు. 

నాగిరెడ్డి చెప్పడంతో వెంటనే ఆ ఊరివెళ్లి నీరజా రెడ్డిని చూసారట.అంతేకాదు వారి కుటంబం వారి వ్యవహారాలు రామానాయుడుకు నచ్చేసాయి. మరోవైపు నీరజారెడ్డి ఫ్యామిలీకి కూడా రామానాయుడు కుటుంబ పద్ధతులు నచ్చాయి. దీంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 1989లో వెంకటేష్, నీరజా రెడ్డిల వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. కానీ నీరజారెడ్డి పేరులో రెడ్డి ఉండటంతో ఆమె రెడ్డి కులానికి చెందిన వారని చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్లది మదనపల్లెలో సెటిలైన కమ్మ ఫ్యామిలీ. ఆ ఏరియాలో ఏ కులానికి చెందిన వ్యక్తులైన పేరు చివరన రెడ్డి పెట్టుకోవడం రివాజుగా వస్తోంది. నీరజా రెడ్డి కూడా వెంకటేష్ మాదిరే విదేశాల్లో ఎంబీయే పూర్తి చేసింది.

ఆ ఊరిలో ఉన్న రెడ్డమ్మ దేవత మీద ఉన్న నమ్మకంతో అందరు తమ పేరు చివర్లో రెడ్డి పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నీరజా రెడ్డి తల్లిది కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరలో ఉన్న వరాహా పట్నం. ఆమెది సంపన్న కుటుంబం. ప్రముఖ రాజకీయ నాయకుడైన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస రావు.. స్వయాన  ఆమె సోదరుడే. నీరజా రెడ్డికి మేనమామ అవుతారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link