Add Zee Business As A Preferred Source
App

Venus Effect: శుక్రుడి అపార శుభ ప్రభావం.. ఈ రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్.. లగ్జరీ లైఫ్..

Published: Oct 12, 2025, 10:01 AM IST|Updated: Oct 12, 2025, 10:01 AM IST

Venus Blessed Zodiac Signs: శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా విశేషమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఈ నెలలో జరిగే శుక్రుడి సంచార ప్రభావం ఏయే రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకోండి.

Venus Blessed Zodiac Signs In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఇది ప్రతి 23 రోజులకు ఒకసారి మాత్రమే ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు గ్రహ సంచారంతో పాటు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఇలా చేయడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. శుక్ర గ్రహాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశులకు ధనవర్షం కురిపిస్తుంది. 
 

Lucky Zodiac Signs1/5

శుక్ర గ్రహం

శుక్ర గ్రహం జాతకంలో బలంగా ఉంటే సంపాదనను ఎవరు ఆపలేరు.  ముఖ్యంగా దీనివల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా.. బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా నష్టాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. అయితే ఈ నెలలో శుక్రుడి అనుగ్రహం పొందే రాశులేవో తెలుసుకోండి.   

Astrology Zodiac Signs2/5

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారికి శుక్రుడు ఇతర రాశిలోకి ప్రవేశించడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా తోబుట్టువులతో మంచి స్నేహ సంబంధం ఏర్పడుతుంది. అలాగే కుటుంబ పరంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా స్నేహితులు ఈ సమయంలో మీకోసం ఎన్నో పనులు చేస్తారు.   

Big Benefits For 5 Zodiac Signs3/5

మిథున రాశి 

మిధున రాశి వారికి శుక్రుడు జరిపే కదలికల కారణంగా ఈ నెలలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి శుక్రుడు జాతకంలో నాలుగవ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. కుటుంబ పరంగా కొంత ఖర్చులు పెరిగినప్పటికీ అనేక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే కొన్ని ఖర్చులు నివారించుకోవడం చాలా మంచిది.  

3 Powerful Zodiac Signs4/5

సింహరాశి 

సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడి శుభ ప్రభావం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కమ్యూనికేషన్ పరంగా వస్తున్న చిక్కులు మొత్తం తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా అనుకున్న ప్రయోజనాలు పొందగలుగుతారు. దీంతోపాటు పెద్ద పెద్ద సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

Powerful Zodiac Signs In Telugu5/5

సింహరాశి 

సింహ రాశి వారికి కూడా ఈ సమయంలో ఎన్నో రకాల అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రయాణాలు మానుకోవడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆభరణాలపై ఖర్చులు పెట్టే అవకాశాలున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ లాభదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా వీరికి కుటుంబ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.