Venus Transit Effect On Zodiac: ఈ నెలలో శుక్ర చతుర్భుజ సంచారం చేయబోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది.
Venus Transit Effect On Zodiac 2025: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. మరికొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేస్తాయి. దీనివల్ల ప్రపంచంపై ప్రభావం పడడమే కాకుండా మొత్తం అన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తాయి. ఇదిలా ఉంటే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మేలు కూడా జరుగుతుంది. ముఖ్యంగా గ్రహసంచారాల పరంగా అక్టోబర్ నెల చాలా అద్భుతమైన భావించవచ్చు.
1/6అక్టోబర్ నెలలో శుక్రుడు నాలుగుసార్లు సంచారాన్ని చేయబోతున్నాడు. ముఖ్యంగా అక్టోబర్ ఆరున ఇప్పటికే శుక్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేశాడు. మరోసారి అక్టోబర్ 9న శుక్రుడు కన్య రాశిలోకి సంచారం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 17న ఎంతో ప్రత్యేకత కలిగిన హస్త నక్షత్రంలో వెళ్తాడు. ఇక చివరగా అక్టోబర్ 28న చిత్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల ప్రత్యేకమైన ఎఫెక్ట్ అన్ని రాశుల వారిపై పడుతుంది.
2/6ముఖ్యంగా శుక్రుడు చతుర్భుజ రాశి సంచారం చేయడం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరగవచ్చు. సకాలంలో ప్రయాణాలు చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
3/6మేష రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా లభిస్తుంది అలాగే వీరికి కుటుంబ సభ్యుల నుంచి కొన్ని బాధ్యతలు కూడా లభిస్తాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారు సీనియర్ల నుంచి సపోర్టు పొంది.. పనులను చాలా సులభంగా అద్భుతమైన పద్ధతుల్లో చేయగలుగుతారు. మేష రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది.
4/6ధనస్సు రాశి వారికి శుక్రుడి ప్రభావం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆదాయం చాలా బాగుంటుంది. అలాగే సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలున్నాయి. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనులు కూడా వెంటనే చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు మధ్య సంబంధాలు దృఢంగా మారుతాయి.
5/6ధనస్సు రాశి వారు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరు ఈ సమయంలో వాహనాలు లేదా ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నా వారు.. సమయంలో తప్పకుండా పొందుతారు. ఇక తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా విపరీతంగా పెరుగుతాయి.
6/6కుంభ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల వచ్చే మార్పులు చాలా శుభ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అలాగే కెరీర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా సంతృప్తిగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సమాజంలో వీరు కొత్త గుర్తింపు పొందుతారు.