Add Zee Business As A Preferred Source
App

Numerology Facts: ఈ అంకెల్లో జన్మించిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం మీకు ప్రశాంతతే..

Published: Sep 20, 2025, 10:29 AM IST|Updated: Sep 20, 2025, 10:29 AM IST

Numerology Facts Telugu: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని కార్డినల్ అంకెల్లో జన్మించిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం చాలా శుభప్రదమని నిపుణులు తెలుపుతున్నారు. వీరిని పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయట. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 

Numerology Facts Telugu News: జ్యోతిష్య శాస్త్రానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో.. సంఖ్యా శాస్త్రానికి కూడా అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ఏ వ్యక్తి గురించి అయినా ఎంతో క్లియర్‌గా చెప్పగలుగుతుంది. కార్డినల్ సంఖ్యను ఆధారంగా చేసుకుని వ్యక్తి జీవితంలో జరగబోయే వివిధ సందర్భాలతో పాటు ప్రతికూల, సానుకూల అంశాల గురించి కూడా ఎంతో క్లియర్‌గా సంఖ్యా శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా లైఫ్‌లోకి రాబోయే జీవిత భాగస్వామి గురించి కూడా ముందుగానే తెలుసుకోవచ్చు. 
 

Dob Numerology1/5

కార్డినల్ సంఖ్య

కార్డినల్ సంఖ్యను ఆధారంగా చేసుకుని సంఖ్యా శాస్త్రం ద్వారా జీవితంలో జరగబోయే ఏదైనా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 2, 11, 20 20తో పాటు 29 తేదీల్లో జన్మించిన వ్యక్తుల కార్డు సంఖ్య 2గా పేర్కొన్నారు. ఈ తేదీల్లో జన్మించిన వారు జీవితంలో ఉత్తమ భాగస్వాములుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయట.   

Numerology Tips2/5

కార్డినల్ సంఖ్య వివరాలు

ముఖ్యంగా కార్డినల్ సంఖ్య రెండు ఉన్న యువతిని పెళ్లి చేసుకోవడం వల్ల జీవితం అద్భుతంగా సాగుతుందట. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. కార్డినల్ 2 సంఖ్యను చంద్రుడు పాలిస్తాడు. కాబట్టి ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు.   

Name Numerology3/5

ఉన్నత స్థాయి..

అలాగే ఈ సంఖ్యల్లో జన్మించిన వ్యక్తులు కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా జీవించి, ఉన్నత స్థాయికి ఎదుగుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా వీరు ప్రేమలో పడితే జీవితాంతం తమ భాగస్వామిని వదిలిపెట్టరని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరు తమకోసం అన్ని రకాల పరిమితులను దాటుకుంటారు. అంతేకాకుండా కష్ట సమయాల్లో పనులు చేసి అద్భుతమైన పేరు ప్రతిష్టలు పొందుతారు.  

Astrology Facts4/5

కార్డినల్ సంఖ్య 4

1,3,4,6 కార్డినల్ సంఖ్యలు కలిగిన యువతులను పెళ్లి చేసుకోవడం కూడా చాలా శుభప్రదమని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరిని పెళ్లి చేసుకోవడం వల్ల వ్యక్తులు ఉన్నత శిఖరాలకి చేరుకుంటారట. అంతేకాకుండా అన్నింటా కలిసి వస్తుందని వారి తెలుపుతున్నారు. ముఖ్యంగా కార్డినల్ సంఖ్య 4లో జన్మించిన యువతులను పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.   

Numerology Facts5/5

కార్డినల్ సంఖ్య 4

కార్డినల్ సంఖ్య నాలుగులో జన్మించిన వారిని రాహువు గ్రహం పరిపాలిస్తాడు. కాబట్టి వీరికి ఎల్లప్పుడు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రేమించిన వారి కోసం ఎలాంటి పనులైనా చేయగలుగుతారు. అలాగే కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రేమ జీవితాన్ని గడుపుతారు. భర్తలు భార్యలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెతోనే జీవితాన్ని గడుపుతారు.