Add Zee Business As A Preferred Source
App

Shani Dev Effect: దసరా మరుసటి రోజే శని కదలికలు.. ఈ రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు.. ఇదే జరగబోతోంది!

Published: Sep 28, 2025, 08:28 AM IST|Updated: Sep 28, 2025, 08:28 AM IST

Shani Dev Effect On Zodiac: శని గ్రహం విజయదశమి ఆ తర్వాత రోజున నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై కీడు ప్రభావం కూడా పడుతుంది. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ లాభాలు కలుగుతాయి.

Shani Dev Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అత్యంత ప్రత్యేకత కలిగిన గ్రహాల్లో శని ఒకటి. ఇది చాలా పవర్ ఫుల్ గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కర్మలకు ప్రదాతగా కూడా భావిస్తారు. అంతమంది అయితే శని గ్రహాన్ని న్యాయదేవతగా కొలుస్తారు. శని వ్యక్తులు చేసే కర్మలకు అనుగుణంగా ఫలితాలను అందిస్తూ ఉంటాడు. ఈ గ్రహం జాతకంలో అశుభ స్థానంలో ఉంటే ఎప్పుడూ ప్రతికూల ఫలితాలే కలుగుతూ ఉంటాయి. 
 

Shani Dev Effect1/5

శని ప్రభావం...

శని ప్రభావం వ్యక్తుల జీవితాల్లో నెమ్మదిగా ప్రారంభమవుతుంది.. దీని ప్రభావం చాలా శక్తివంతమైనదిగా కూడా భావిస్తారు. జాతకంలో ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైతే జీవితంలో అనేక ఇబ్బందులతో పాటు సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి.   

Shani Aarti2/5

శని శుభస్థానం

అదే జాతకంలో శని శుభస్థానంలో ఉంటే.. ఊహించని లాభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి సంపాదనతో పాటు గౌరవం కూడా లభిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా పురోగతి కూడా కలిగి ఊహించని లాభాలు పొందగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా పుంజుకోగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 3న విజయదశమి తర్వాత శనిగ్రహం పూర్వ భాద్రపద నక్షత్రంలో సంచారం చేయబోతోంది. 27 సంవత్సరాలు తర్వాత ఈ సంచారం జరగడం విశేషం. దీనివల్ల కొన్ని రాశుల వారు విశేషమైన లాభాలు పొందుతారు.  

Shanidev Chalisa3/5

మేషరాశి 

మేష రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఎంతో ఓపికగా ఉండి పనులు చేసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.   

Shani Dev Vrat Katha4/5

కర్కాటక రాశి 

కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని శక్తివంతమైన ప్రభావం వల్ల మిశ్రమ లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి.

Shani Dev Ki Aarti5/5

తులారాశి 

తులారాశి వారికి కూడా ఈ సమయం ఎన్నో రకాల మిశ్రమ లాభాలు అందిస్తుంది. ముఖ్యంగా వీరికి ఆరోగ్యం పట్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మేలు. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.